మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: క్రికెటర్ షమీ

| Edited By:

May 03, 2020 | 2:39 PM

తాను మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ అన్నారు. హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మతో చేసిన లైవ్‌ చాట్‌లో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు. వ్యక్తిగత కారణాలు, తీవ్ర ఒత్తిడి కారణంగా మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని తాను భావించినట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో తన కుటుంబం సపోర్ట్ లేకపోతే తాను క్రికెట్‌ను వదలాల్సి వచ్చేదేమోనని షమీ వివరించారు. తీవ్ర ఒత్తిడి, వ్యక్తిగత ఇబ్బందుల వలన మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. […]

మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: క్రికెటర్ షమీ
Follow us on

తాను మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ అన్నారు. హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మతో చేసిన లైవ్‌ చాట్‌లో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు. వ్యక్తిగత కారణాలు, తీవ్ర ఒత్తిడి కారణంగా మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని తాను భావించినట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో తన కుటుంబం సపోర్ట్ లేకపోతే తాను క్రికెట్‌ను వదలాల్సి వచ్చేదేమోనని షమీ వివరించారు.

తీవ్ర ఒత్తిడి, వ్యక్తిగత ఇబ్బందుల వలన మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో క్రికెట్ గురించి కూడా నేను ఆలోచించలేకపోయాను. మేము 24వ ఫ్లోర్‌లో ఉండేవాళ్లం. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానేమోనని మా ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు. నా 2-3 స్నేహితులు నాతోనే 24 గంటల పాటు ఉండేవాళ్లు. ఆ సమయంలో క్రికెట్‌ మీద దృష్టి పెట్టమని నా తల్లిదండ్రులు ఎంతో మద్దతును ఇచ్చారు. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ఓ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని మళ్లీ క్రికెట్‌ మీద దృష్టి సారించా అని షమీ చెప్పుకొచ్చారు.

ఇక 2015 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో గాయపడ్డ తరువాత మళ్లీ ఫీల్డ్ లోకి వచ్చేందుకు తనకు 18 నెలల సమయం పట్టిందని షమీ తెలిపారు. ఇక ఐపీఎల్ సమయంలోనూ రోడ్డు ప్రమాదానికి గురయ్యానని.. ఆ సమయంలో తన కుటుంబం సమస్యలు మీడియాలో ఎక్కువగా హైలెట్ అయ్యాయని షమీ ఆ లైవ్‌ చాట్‌లో వివరించారు.

Read This Story Also: ఎన్టీఆర్ కంటే ముందు ఆ హీరోతో త్రివిక్రమ్ మూవీ..!