AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు రికార్డులకు చేరువలో కోహ్లీ

ఐపీఎల్‌ 12వ సీజన్‌ కోసం యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు మొదటి మ్యాచుకు సన్నద్ధమయ్యాయి. కాగా ప్రపంచక్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఈరోజు చెన్నైతో మ్యాచ్‌లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు. ఐదు వేల పరుగులు : అలాగే 52 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడిగా కోహ్లీ చరిత్రలో నిలిచిపోతాడు. […]

మూడు రికార్డులకు చేరువలో కోహ్లీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2019 | 3:43 PM

Share

ఐపీఎల్‌ 12వ సీజన్‌ కోసం యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు మొదటి మ్యాచుకు సన్నద్ధమయ్యాయి. కాగా ప్రపంచక్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఈరోజు చెన్నైతో మ్యాచ్‌లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు.

ఐదు వేల పరుగులు : అలాగే 52 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడిగా కోహ్లీ చరిత్రలో నిలిచిపోతాడు. మరోవైపు రైనా సైతం మరో 15 పరుగులు చేస్తే ఐదు వేల పరుగులకు చేరుకుంటాడు.

ఐపీఎల్లో అత్యధిక పరుగులు: ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌రైనా మొదటిస్థానంలో ఉన్నాడు. 176 మ్యాచుల్లో 4985 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాయల్‌ ఛాలెంజర్స్ కెప్టెన్‌ కోహ్లీ 163 మ్యాచుల్లో 4948 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 38 పరుగులు చేస్తే రైనాను దాటి ముందుకు దూసుకుపోతాడు.

అత్యధిక అర్ధ శతకాలు: ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో అర్ధశతకం బాదితే.. ఇప్పటికే ఐపీఎల్‌లో 39 అర్ధశతకాలు బాదిన డేవిడ్‌ వార్నర్‌ చెంతన చేరతాడు. దీంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 52 పరుగులు చేస్తే, ఒకేసారి మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు.

Follow Us