AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూజిల్యాండ్‌లో జరిగిన ఓషియానిక్‌ స్కేటింగ్‌ పోటీల్లో గోల్డ్‌ సాధించిన తెలుగు అమ్మాయి..!

ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తళుక్కుమని మెరిసింది. న్యూజిల్యాండ్‌లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీరాజ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

న్యూజిల్యాండ్‌లో జరిగిన ఓషియానిక్‌ స్కేటింగ్‌ పోటీల్లో గోల్డ్‌ సాధించిన తెలుగు అమ్మాయి..!
Jessyka Raj
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Jun 16, 2024 | 2:41 PM

Share

ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తళుక్కుమని మెరిసింది. న్యూజిల్యాండ్‌లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీరాజ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. మూడేళ్ల పాటు తాను ఎంతో శ్రమించి కఠోరంగా శిక్షణ పొందిన ఇన్‌లైన్‌ స్కేటింగ్‌లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్ధులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది.

13 ఏళ్ల వయసులోనే దేశంలోనే నెంబర్‌–1 స్కేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జెస్సీని రోలర్‌ స్కేటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఇండియా స్కేట్‌) ఈ ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది. జూన్ నెల 13 తేదీన న్యూజిల్యాండ్‌లోని టీఎస్‌బీ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. పసిఫిక్‌ కప్‌ ఆర్టిస్టిక్‌ ఓపెన్‌ ఇన్విటేషనల్‌ కాంపిటిషన్‌ పేరుతో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భారత్‌తో పాటు అస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, జపాన్, న్యూజిల్యాండ్‌ దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. రెండు రౌండ్‌లలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి జెస్సీ అత్యధికంగా 31.98 పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచ క్రీడా వేదికపై భారత జాతీయ పతకాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన జెస్సీని ఆంధ్రప్రదేశ్‌ రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి థామస్‌ చౌదరి, కోచ్‌ సింహాద్రి అభినందించారు. విజయవాడలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న జెస్సీ 2021 నుంచి స్కేటింగ్‌ శిక్షణ తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఆమె ప్రాతినిధ్యం వహించిన జాతీయ పోటీల్లో ఒక గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్, రాష్ట్ర పోటీల్లో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, రెండు బ్రాంజ్, జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు గోల్డ్, ఎనిమిది సిల్వర్‌ మెడల్స్‌ సాధించింది. వీటిలో పాటు స్కూల్‌ లెవల్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో 13, డాన్స్‌ పోటీల్లో ఒకటి, క్విజ్‌ పోటీల్లో రెండు, పేయింటింగ్‌ పోటీల్లో ఒక మెడల్‌ను సాధించి పిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..