పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. గురువారం (ఆగస్టు 01) జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు . 8 మందితో జరిగిన ఫైనల్ రౌండ్‌లో భారత షూటర్ మొత్తం 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ ఒలింపిక్స్ లో భారత్‌కు మూడో కాంస్య పతకాన్ని సాధించిపెట్టాడు. చైనాకు చెందిన లియు యుకున్ 463.6 పాయింట్లతో బంగారు పతకాన్ని గెలుచుకోగా, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి కులిష్ 461.3 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్ లో 7వ స్థానంతో ఫైనల్స్‌లోకి ప్రవేశించిన స్వప్నిల్ కుసాలే చివరి రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. చెక్ రిపబ్లిక్ షూటర్ జిరి ప్రెవ్రత్ స్కీ (440.7 పాయింట్లు)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత షూటర్ మొత్తం 451.4 పాయింట్లు సేకరించి తన తొలి ఒలింపిక్స్ పతకాన్ని సాధించగలిగాడు.
దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను భాకర్ భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని అందించింది. ఆ తర్వాత మిక్స్‌డ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 రౌండ్ ఈవెంట్‌లో షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
🇮🇳🔥 𝗜𝗻𝗱𝗶𝗮’𝘀 𝗲𝗹𝗶𝘁𝗲 𝘀𝗵𝗼𝗼𝘁𝗲𝗿𝘀! A historic achievement for Swapnil Kusale as he wins India’s first-ever medal in the 50m Rifle 3 Positions shooting event at the Olympics.
🧐 Here’s a look at India’s shooting medallists in the Olympics over the years.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
🇮🇳🥉 𝗕𝗥𝗢𝗡𝗭𝗘 𝗡𝗢. 𝟯 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔! Many congratulations to Swapnil Kusale on winning India’s third medal at the Paris 2024 Olympics!
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗮𝗴𝗲 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗮𝘁𝗵𝗹𝗲𝘁𝗲𝘀 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗣𝗮𝗿𝗶𝘀… pic.twitter.com/eokW7g6zAE
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..