ఇదేం సెలక్షన్ కమిటీ సామీ.. కుంటి బాతులా ఉంది – సునీల్ గవాస్కర్

| Edited By: Ram Naramaneni

Jul 30, 2019 | 4:24 AM

సీనియర్ సెలెక్టర్ ఎం‌ఎస్కె ప్రసాద్ నేతృత్వంలో వ్యవహరిస్తున్న సెలక్షన్ కమిటీ కుంటి బాతులా ఉందంటూ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రపంచకప్ ఓటమితోనే కోహ్లీ కెప్టెన్సీ ముగిసిందన్న గవాస్కర్.. విండీస్ టూర్‌కు కూడా కోహ్లీనే కెప్టెన్‌గా నిర్ణయించడం సెలక్షన్ కమిటీ కుంటిబాతు పద్దతిని ఫాలో అవుతోందని తప్పుబట్టారు. కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కమిటీ దిగ్గజ క్రికెటర్లతో కలిపి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. […]

ఇదేం సెలక్షన్ కమిటీ సామీ.. కుంటి బాతులా ఉంది - సునీల్ గవాస్కర్
Follow us on

సీనియర్ సెలెక్టర్ ఎం‌ఎస్కె ప్రసాద్ నేతృత్వంలో వ్యవహరిస్తున్న సెలక్షన్ కమిటీ కుంటి బాతులా ఉందంటూ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రపంచకప్ ఓటమితోనే కోహ్లీ కెప్టెన్సీ ముగిసిందన్న గవాస్కర్.. విండీస్ టూర్‌కు కూడా కోహ్లీనే కెప్టెన్‌గా నిర్ణయించడం సెలక్షన్ కమిటీ కుంటిబాతు పద్దతిని ఫాలో అవుతోందని తప్పుబట్టారు. కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కమిటీ దిగ్గజ క్రికెటర్లతో కలిపి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అటు విరాట్ కోహ్లీ తనకు నచ్చిన వారికి మాత్రమే జట్టులో చోటు కల్పించడంపై కూడా గవాస్కర్ మండిపడ్డారు. సెలక్షన్ కమిటీ అఛేతనంగా మారిందని వ్యాఖ్యానించారు.