సౌర‌వ్ గంగూలీ ఫ‌స్ట్‌ కోచ్ క‌న్నుమూత‌

| Edited By:

Jul 30, 2020 | 8:57 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ మొద‌టి కోచ్ అశోక్ ముస్త‌ఫీ(86) గురువారం మృతి చెందారు. దీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న త‌న కూతురితో పాటు లండ‌న్‌లో...

సౌర‌వ్ గంగూలీ ఫ‌స్ట్‌ కోచ్ క‌న్నుమూత‌
Follow us on

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ మొద‌టి కోచ్ అశోక్ ముస్త‌ఫీ(86) గురువారం మృతి చెందారు. దీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న త‌న కూతురితో పాటు లండ‌న్‌లో ఉండేవారు. అయితే గుండె సంబంధిత వ్యాధి కార‌ణంగా ఏప్రిల్ నుంచి ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉద‌యం కార్డియాక్ అటాక్‌కి గురికావ‌డంతో ఆస్ప‌త్రిలోనే మ‌ర‌ణించిన‌ట్టు ముస్త‌ఫీ కుటుంబ స‌భ్యులు తెలిపారు.

బెంగాల్‌కు క్రికెట్ పాఠాలు నేర్పే దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంట‌ర్‌లో అశోక్ ముస్తాఫీ ప్ర‌ముఖ కోచ్‌గా ఉండేవారు. ఆయ‌న ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న 12 మంది బెంగాల్ రంజీ క్రికెట‌ర్లుగా ఎదిగారు. దీంతో దాదా కూడా చిన్న‌త‌నంలో తొలిసారిగా ముస్తాఫీ వ‌ద్దే క్రికెట్ నేర్చుకున్నారు. సౌర‌వ్ స్నేహితుడు సంజ‌య్ దాస్ కూడా ఆయ‌న వ‌ద్దే క్రికెట్ ప్రారంభించాడు. గ‌త నెల ముస్తాఫీ ఆరోగ్యం క్షీణించ‌గా.. ఆయ‌న వైద్యానికి కావాల్సిన ఏర్పాట్ల‌న్నీ గంగూలీ, సంజ‌య్‌నే చూసుకున్నారు.

Read More:

మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి

వాట్సాప్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌! శాశ్వ‌తంగా నోటిఫికేష‌న్లు మ్యూట్ చేసేలా..