Funny Video: పాకిస్తాన్ పై భారత్ విజయం తర్వాత.. శిఖర్ ధావన్ ఎలా అదరొగట్టాడో చూడండి..

|

Oct 24, 2022 | 4:23 PM

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీ ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన సూపర్ 12 మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన తర్వాత భారత క్రికెట్ అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. భారత్ విజయంతోనే దీపావళి..

Funny Video: పాకిస్తాన్ పై భారత్ విజయం తర్వాత.. శిఖర్ ధావన్ ఎలా అదరొగట్టాడో చూడండి..
Shikhar Dhawan
Follow us on

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీ ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన సూపర్ 12 మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన తర్వాత భారత క్రికెట్ అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. భారత్ విజయంతోనే దీపావళి ప్రారంభమైందన్న రీతిలో దేశం మొత్తం బాణాసంచా కాల్చి.. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేవలం క్రికెట్ అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు, మరెంతోమంది ప్రముఖులు టీమిండియా విజయంతో సందడి చేశారు. టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ అదరగొట్టే డ్యాన్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పోస్టు చేసినప్పటి నుంచి ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన అద్భుతమైన విజయాన్ని భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో శిఖర్ ధావన్ తన చిన్ననాటి స్నేహితుడు సాగర్ తో కలిసి బ్లాక్ కుర్తా పైజామా, సన్ గ్లాసెస్‌ పెట్టుకుని చేసిన డ్యాన్స్ ట్రెండింగ్ అవుతోంది. టీ20 ప్రపంచకప్ లో పాకిసాన్ పై భారత్ గెలిచినప్పుడు అనే అర్థం వచ్చే క్యాప్షన్ ను ఈ పోస్టుకు జత చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

ఆస్ట్రేలియా వేదికగా మెల్ బోర్న్ లో జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 మ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో విరాట్ కోహ్లీ అందరినీ ఆశ్చర్యపర్చే నాక్ ఆడాడు. వరుసగా వికెట్లు పడుతున్నా.. చివరి వరకు వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడుతూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 31 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. మ్యాచ్ పై భారత క్రికెట్ అభిమానులు దాదాపు ఆశలు వదులుకున్నారు. అయితే 37 బంతుల్లో 40 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాతో కలిసి 113 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో కోహ్లీ జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు.

ఇవి కూడా చదవండి

మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు కావాల్సి ఉంది. అయితే చివరి ఓవర్ వరకు కూడా భారత్ విజయం కష్టమనే అనిపించింది. కాని కోహ్లీ తన అద్భుతమైన షాట్లతో అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించి.. పాకిస్తాన్ పై టీమిండియాను గెలిపించాడు. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ విజయం తర్వాత కోట్లాది మంది క్రీడాభిమానులు ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అ జాబితాలో శిఖర్ ధావన్ కూడా చేరాడు.