Serena Williams: టెన్నీస్ ఛాంపియన్ సెరెనా మళ్లీ అమ్మేసిందిగా.. ఇంతకీ ఏం అమ్మిందంటే..

| Edited By: Sanjay Kasula

Jan 24, 2021 | 10:53 PM

Serena Williams: క్రీడాకారులకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ క్రేజ్ రావాలంటే మామూలు విషయంలో కాదండోయ్.

Serena Williams: టెన్నీస్ ఛాంపియన్ సెరెనా మళ్లీ అమ్మేసిందిగా.. ఇంతకీ ఏం అమ్మిందంటే..
Follow us on

Serena Williams: క్రీడాకారులకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ క్రేజ్ రావాలంటే మామూలు విషయంలో కాదండోయ్. దాని వెనుక వెలకట్టలేని వారి శ్రమ, కృషి దాగి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో టాప్ క్రీడాకారులుగా గుర్తింపు పొందిన వారు.. ఎంతో శ్రమ పడితే గానీ ఆ స్థాయికి చేరలేదు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఎప్పటికీ ఆడుతూనే ఉండరు కదా! శరీరం సహకరించనప్పుడు ఆటకు గుడ్ బై చెప్పక తప్పదు. దాంతో చాలా ఆటగాళ్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త ఇళ్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. దాదాపు అందరు ఆటగాళ్లు ఇదే చేస్తారనుకోండి.

ఇదిలాఉంటే, అమ్మకాలు.. కొనుగోళ్లకు సంబంధించిన అంశంలో తాజాగా అమెరికన్ నల్లకలువ, టెన్నీస్ స్టార్ సెరెనా విలియమ్స్ వార్తల్లోకెక్కింది. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ గార్డెన్స్‌లో గల తన ఇల్లును సెరెనా విలియమ్స్ అమ్మేసింది. 5600 చదరపు అడుగులు విస్తీర్ణం, ఐదు బెడ్‌రూమ్‌లు గల ఈ ఇంటిని రూ.20.25 కోట్లకు అమ్మింది. ఈ ఇల్లు చూడటానికి అద్భుతంగా ఉంటదట. అయితే, ఈ ఇల్లును సెరెనా విలియమ్స్ 2015లో రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. మరి ఇల్లును ఎందుకు అమ్మిందనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇదిలాఉంటే.. గతంలోనూ ఓ ఇల్లును సెరెనా ఇలాగే గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసింది. లాస్ ఏంజిల్స్‌లో 2.76 ఎకరాల్లో నిర్మించిన 6,101 చదరపు అడుగుల ఇల్లుని 2006లో రూ. 48 కోట్లకు కొనుగోలు చేసింది సెరెనా. అయితే ఆ ఇల్లుని 2019లో రూ.59 కోట్లకు అమ్మేసింది. కాగా, సెరెనా ఇలా తన ఇళ్లను అమ్ముతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేస్తుందా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Telangana CM Kcr: పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు.. వారం రోజుల్లోగా..

Gold Scam: హైదరాబాద్‌లో వెలుగు చూసిన భారీ గోల్డ్‌ స్కామ్‌… ఏకంగా 1500 మందిని మోసం.. బీహెచ్‌ఈఎల్‌లో సోదాలు..