AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు

Sanju Samson: వెస్టిండీస్‎తో రాంచీలో జరిగిన రెండో టీ20లో సంజూ శాంసన్ 82 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చి మరోసారి నిరాశపరిచాడు. ఒకే కేలండర్ ఇయర్ లో టీ20ల్లో మూడుసార్లు 80 నుంచి 90 పరుగుల మధ్యలో అవుట్ అయిన ప్రపంచంలోని తొలి బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.

Sanju Samson: రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
Sanju Samson
Rakesh
|

Updated on: Oct 10, 2026 | 7:02 AM

Share

Sanju Samson: వెస్టిండీస్‎తో రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కరేబియన్ బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడిన సంజూ కేవలం 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఏకంగా 82 పరుగులు సాధించాడు. ఈ దూకుడు ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోరును నమోదు చేయడం సాధ్యమైంది.

మరోసారి సెంచరీ మిస్సయిన శాంసన్

అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నప్పటికీ సంజూ శాంసన్‌కు సెంచరీ చేసే అదృష్టం మాత్రం దక్కలేదు. సెంచరీకి చేరువవుతున్న సమయంలో కీలక తరుణంలో వికెట్ సమర్పించుకుని నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ ఏడాదిలో ఇలా సెంచరీ చేజార్చుకోవడం సంజూకు ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఆ జాబితాలో చెత్త రికార్డు

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడుసార్లు 80 నుంచి 90 పరుగుల మధ్యలో అవుట్ అయిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాటర్‌గా సంజూ శాంసన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రాంచీలో 82 పరుగుల వద్ద వెనుదిరిగిన ఆయన, అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌పై 89 పరుగులు, అలాగే వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసి తృటిలో సెంచరీలు కోల్పోయారు. ఈ మూడు మ్యాచ్‌లలోనూ శతకం సాధించి ఉంటే విమర్శకులు ఎప్పుడో మౌనంగా ఉండేవారు.

సమర్థించుకున్న సంజూ శాంసన్

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ సంజూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లోనే పిచ్ స్వభావం తనకు అర్థమైందని, బంతి వేగంగా వస్తుందని ముందే అంచనా వేసినట్లు తెలిపారు. ప్రతి బంతిని పెద్ద షాట్ ఆడాలనే ఉద్దేశంతోనే క్రీజులోకి దిగానని, మైదానంలో ఎలాంటి ముందుస్తు ప్లాన్లు వేసుకోకుండా కేవలం పరిస్థితులకు తగినట్లుగా ఆడటానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

దేశం కోసం ఆడడమే ముఖ్యం

క్రికెట్‌లో ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఒక ప్రొఫెషనల్ ఆటగాడిగా ఎల్లప్పుడూ ఒత్తిడిని ఎదుర్కొంటూనే దేశం కోసం ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన ప్రధాన కర్తవ్యమని సంజూ పేర్కొన్నారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు కోసం భారీ స్కోరు సాధించడంలో తాను సంతృప్తిగా ఉన్నానని, రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం