భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గతంలో తన ఆట విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. అయితే గత ఏడాది కాలంగా ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా నిత్యం న్యూస్ లో ఉంటోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది. 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. ప్రస్తుతం సానియా తన జీవితంలో చాలా కష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు ఎంతో ట్రై చేస్తోందీ టెన్నిస్ స్టార్. తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతోంది. సానియా ఇప్పుడు పూర్తి సమయాన్ని తన కుమారుడికే కేటాయిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అయితే ఎప్పుడూ షోయబ్ మూడో పెళ్లి వ్యవహారంపై కామెంట్స్ చేయలేదీ హైదరాబాదీ క్వీన్. అయితే కొన్నిసార్లు తన మసులోని భావోద్వేగాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తుంది సానియా. అలా తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
సానియా మీర్జా తాజాగా తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టీ-షర్ట్‌పై ‘నేను ఇప్పుడు బాగానే ఉంటున్నానని అనుకుంటున్నాను’ అని అర్థం వచ్చేలా ఒక ఇంగ్లిష్ స్లోగన్ అర్థం ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.’ మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘ఇది బెస్ట్ ఫొటో’ మరొక యూజర్ రాసుకొచ్చారు. సానియా తన కుమారుడితో కలిసి ఫోటో షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సానియా తన కొడుకుతో కలిసి ఫోటోను పంచుకున్నప్పుడల్లా, అభిమానులు దానిని ప్రేమతో ముంచెత్తారు. తాజా పోస్ట్‌పై కూడా నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే షోయబ్ తో విడాకుల తర్వాత సానియా కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీతో సానియా రెండో వివాహం జరగనుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ వార్తలపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహ్మద్ షమీతో సానియా పెళ్లి అంటూ వస్తోన్న వార్తలు నమ్మవద్దని, అవన్నీ చెత్త వార్తలన్నారు.
సానియా ట్వీట్ ఇదిగో…
🤲🏽❤️🕋 pic.twitter.com/oKOnQ0FInU
— Sania Mirza (@MirzaSania) June 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.