సచిన్ పాయింట్లే కోరుకుంటున్నాడు.. నేను ప్రపంచకప్ కోరుకుంటున్నా

సచిన్ కేవలం రెండు పాయింట్లు కోరుకుంటున్నాడని.. కానీ తాను మాత్రం భారత్ ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ప్రపంచకప్‌లో 10జట్లు ఆడుతాయని.. కేవలం ఒక్క మ్యాచ్ ఆడకపోతే పెద్దగా నష్టమేమి ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఆడకపోతే మనకే నష్టమని.. అనవసరంగా పాయింట్లు చేజార్చుకున్నవాళ్లం అవుతామని సచిన్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ ఈ మేరకు స్పందించారు. పుల్వామా దాడితరువాత పాక్‌తో భారత్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని గంగూలీ వ్యాఖ్యానించారు. క్రికెట్‌తో […]

సచిన్ పాయింట్లే కోరుకుంటున్నాడు.. నేను ప్రపంచకప్ కోరుకుంటున్నా

Edited By:

Updated on: Mar 06, 2019 | 7:57 PM

సచిన్ కేవలం రెండు పాయింట్లు కోరుకుంటున్నాడని.. కానీ తాను మాత్రం భారత్ ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ప్రపంచకప్‌లో 10జట్లు ఆడుతాయని.. కేవలం ఒక్క మ్యాచ్ ఆడకపోతే పెద్దగా నష్టమేమి ఉండదని అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఆడకపోతే మనకే నష్టమని.. అనవసరంగా పాయింట్లు చేజార్చుకున్నవాళ్లం అవుతామని సచిన్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ ఈ మేరకు స్పందించారు. పుల్వామా దాడితరువాత పాక్‌తో భారత్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని గంగూలీ వ్యాఖ్యానించారు.

క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ పాక్‌తో తెగదెంపులు చేసుకోవాలని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యాలపై పాక్ మాజీ క్రికెటర్ మియాందాద్ స్పందిస్తూ.. గంగూలీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని.. పబ్లిసిటీ కోసమే ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని అన్నారు.

మియాందాద్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ స్పందిస్తూ.. అతడి వ్యాఖ్యలపై తను స్పందించాలనుకోవట్లేదని.. ఆయన ఆటనుతను ఆస్వాదించేవాణ్ణని అన్నారు. పాక్ తరపున ఆడిన వాళ్లలో మియాందాద్ అద్భుతమైన ఆటగాడని అన్నారు.