అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో రోహిత్ శర్మ

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:27 PM

భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో ఉన్నాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా…ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా…గప్తిల్, గేల్‌తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకోనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే, న్యూజిలాండ్ […]

అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో రోహిత్ శర్మ
Follow us on

భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్‌కి అతి చేరువలో ఉన్నాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా…ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా…గప్తిల్, గేల్‌తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకోనున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే, న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్తిల్, వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్‌గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 102 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ వైజాగ్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ తరఫున టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డ్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత యువరాజ్ సింగ్ 72 సిక్సర్లతో ఉన్నాడు.