
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఆసియా లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ మెరుపులతో అదరగొట్టాడు. అంతేకాక ఈ మ్యాచ్‌లో అర్థశతకం బాదిన గంభీర్.. లీగ్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించాడుజ. ఈ మూడు అర్థశతకాలతో ఆటకు దూరమైనా.. తనలో బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని షాహిద్ అఫ్రిదీ సేనకు చాటిచెప్పాడు. మంగళవారం ఇండియా మహరాజాస్, ఆసియా లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బాల్స్‌లోనే 12 ఫోర్లతో గంభీర్ 61 పరుగులు చేశాడు. మహారాజాస్‌కు సారథిగా ఉన్న గంభీర్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అతడితో పాటు రాబిన్ ఉతప్ప(39 బాల్స్‌లో 5 సిక్సర్లు, 11 ఫోర్లతో 88 పరుగులు) కూడా భీకరమైన బ్యాటింగ్‌తో పది వికెట్ల తేడాతో ఆసియా లయన్స్‌ను చిత్తుచేసేందుకు సహకరించాడు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉపల్ తరంగ (69 రన్స్), దిల్షాన్ (32 రన్స్)తో పాటు చివరలో అబ్ధుల్ రజాక్ 27 రన్స్‌తో రాణించారు. ఈ క్రమంలో ఇండియా మహరాజాస్ బౌలర్లలో రైనా రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉతప్ప, గంభీర్ మెరుపులతో 158 పరుగుల టార్గెట్‌ను 12.3 ఓవర్లలోనే చేధించి ఇండియా మహరాజాస్‌కు విజయం సాధించి పెట్టారు. అలాగే అంతకముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో కూడా గౌతమ్ గంభీర్ 54(39), 68(42) పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..