Rishabh Pant: ఇంకా మూడు సిక్సర్లే.. కొత్త చరిత్ర లిఖించనున్న రిషబ్ పంత్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డులను సృష్టించి పంత్.. ఇప్పుడు మరో రికార్డుపై కన్నేశాడు. ఆ రికార్డు ఏంటన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం ..

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా మూడు సిక్సర్ల ద్వారా. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న 4వ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 3 సిక్సర్లు కొడితే, సరికొత్త రికార్డును నమోదు చేస్తాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 46 మ్యాచ్‌లు ఆడిన పంత్ మొత్తం 81 ఇన్నింగ్స్‌లలో 88 సిక్సర్లు కొట్టాడు. ఈ సిక్సర్లతో భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. దేశం తరఫున 178 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన సెహ్వాగ్ 10346 బంతుల్లో 90 సిక్సర్లు బాదాడు. దీనితో అతను టీమిండియా తరఫున టెస్ట్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 116 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సమయంలో అతడు 7538 బాల్స్ ఎదుర్కొని 88 సిక్సర్లు బాదాడు. దీంతో,సెహ్వాగ్ తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ ఇప్పుడు కేవలం 81 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. 88 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్న పంత్, మాంచెస్టర్ టెస్ట్‌లో 3 సిక్సర్లు కొడితే టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ నిలుస్తాడు. దీంతో సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తాడు.
పంత్ మరో రికార్డును సైతం నమోదు చేసేందుకు చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక రన్స్ సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా నిలవడానికి కొన్ని రన్స్ దూరంలో నిలిచాడు. ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ 69 ఇన్నింగ్స్‌లలో 2716 పరుగులు చేయగా.. పంత్ 67 ఇన్సింగ్స్ లలోనే 2677 రన్స్ చేశాడు. ఇంకా 40 రన్స్ చేస్తే రోహిత్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఈ లిస్ట్‌లో కోహ్ల మూడో స్థానంలో, గిల్ నాల్గవ స్థానంలో, జడేజా ఐదో స్థానంలో ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




