5

ఫోర్బ్స్ జాబితా: షట్లర్ సింధు వాలెట్‌లో 39కోట్లు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరో అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్-2019 మహిళా అథ్లెట్ల జాబితాలో భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది సింధు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానాన్ని సాధించుకుంది. ఈ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాల రూ.39కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. సింధు మినహా భారత్ నుంచి మరే క్రీడాకారిణికి ఇందులో చోటు లభించకపోవడం విశేషం. ఇక ఈ జాబితాలో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రూ.207 కోట్లతో మొదటి […]

ఫోర్బ్స్ జాబితా: షట్లర్ సింధు వాలెట్‌లో 39కోట్లు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 12:34 PM

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరో అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్-2019 మహిళా అథ్లెట్ల జాబితాలో భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది సింధు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానాన్ని సాధించుకుంది. ఈ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాల రూ.39కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. సింధు మినహా భారత్ నుంచి మరే క్రీడాకారిణికి ఇందులో చోటు లభించకపోవడం విశేషం.

ఇక ఈ జాబితాలో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రూ.207 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా.. జపాన్ టెన్నిస్ కెరటం నవోమి ఒసాకా(రూ.172కోట్లు), జర్మనీ టెన్నిస్ తార ఏంజెలినా కెర్బర్(రూ.84కోట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు సదరు అథ్లెట్ల టోర్నీ ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల ద్వారా లభించిన మొత్తం ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.