Punjab: వాలీబాల్ ప్లేయర్ గా మారిన సీఎం.. ఆటతీరుకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

|

Aug 30, 2022 | 10:36 AM

సాధారణంగా ప్రజా ప్రతినిధులు ఏవైనా క్రీడా పోటీలను ప్రారంభించినప్పుడు.. ఆసందర్భంగా ఫోటోలకు స్టిల్స్ కోసం క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం లేదా బౌలింగ్ వేయడం, ఇతర పోటీలైతే దానికి సంబంధించిన ఆట ఆడుతున్నట్లు ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం చూస్తాం. కొంతమంది అయితే..

Punjab: వాలీబాల్ ప్లేయర్ గా మారిన సీఎం.. ఆటతీరుకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..
Punjab Cm
Follow us on

Bhagwant mann: సాధారణంగా ప్రజా ప్రతినిధులు ఏవైనా క్రీడా పోటీలను ప్రారంభించినప్పుడు.. ఆసందర్భంగా ఫోటోలకు స్టిల్స్ కోసం క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం లేదా బౌలింగ్ వేయడం, ఇతర పోటీలైతే దానికి సంబంధించిన ఆట ఆడుతున్నట్లు ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం చూస్తాం. కొంతమంది అయితే ఏదైనా క్రీడలో ప్రావీణ్యం ఉంటే కొద్ది సేపు ఆ ఆట ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరుస్తారు. ప్రావీణ్యం లేకపోయినా ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఆడితే అదీ ఓక సీఏం స్థాయి వ్యక్తి సాధారణ క్రీడాకారులతో కలిసి క్రీడాకారుడిగా మారిపోతే.. ఆకిక్కే వేరబ్బా. పంజాబ్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా సీఏం భగవంత్ మాన్ అక్కడి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఆవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవీడియో చూసిన నెటిజన్ల పంజాబ్ సీఏం ఆటతీరుకు ఫిదా అవుతున్నారు.

ఈవీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ శాఖ షేర్ చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్రాక్ సూట్ ధరించి.. సెంటర్ లో ఉండి ఆరుగురి జట్టులో ఓ సభ్యుడిలా ఆడుతూ అక్కడి వారందరినీ ఉత్సహపర్చారు. కేవలం ఏదో ఆట ఆడటమే కాదు. సర్వీస్ చేసి.. సర్వ్ లో పాయింట్ గెలిచారు సీఏం భగవంత్ మాన్. ఖేదన్ వతన్ పంజాబ్ దియాన్-2022 లో భాగంగా క్రీడాపోటీలను సీఏం ప్రారంభించారు. దాదాపు 2 నెలల పాటు జరగే ఈక్రీడాపోటీలను జలంధర్ లోని గురుగోవింద్ సింగ్ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. ‘మన్ సాహబ్ ఆన్ ది పిచ్’ క్యాప్షన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ శాఖ ఈవీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

ఇవి కూడా చదవండి

10 నుంచి 15 నిమిషాల పాటు వాలీబాల్ ఆడి సీఏం భగవంత్ మాన్ క్రీడాకారులకు ఉత్సహనిచ్చారు. ఈకార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లాక్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు 28 క్రీడా విభాగాల్లో జరిగే పోటీల్లో 4లక్షల మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి విజేతలకు అన్ని విభాగాల్లో కలిపి దాదాపు రూ.6 కోట్ల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు సీఏం ప్రకటించారు. పంజాబ్ లోని క్రీడాకారులు, యువత సంతోషంగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..