AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్మెంట్‌ ప్రకటించిన పార్థివ్‌ పటేల్‌… టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం

టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

రిటైర్మెంట్‌ ప్రకటించిన పార్థివ్‌ పటేల్‌... టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 09, 2020 | 3:17 PM

Share

Parthiv Patel announces his retirement from all cricket టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ 35 ఏళ్ల ఆటగాడు టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. మొత్తంగా 1706 పరుగులు.. 93 క్యాచ్‌లు, 19 స్టంపిం‍గ్స్‌ చేశాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో…

పార్థివ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గుజరాత్‌ తరపున 194 మ్యాచ్‌లు ఆడాడు. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా పార్థివ్‌ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్‌ అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఆరంభంలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అదే ప్రదర్శను చూపించలేకపోయాడు.

అదే సమయంలో దినేష్‌ కార్తిక్‌, ఎంఎస్‌ ధోనిలు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడంతో పార్థివ్‌ కెరీర్‌ డౌన్‌ఫాల్‌ మొదలైంది. ముఖ్యంగా ధోని అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా మారిన తర్వాత పార్థివ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పార్థివ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో పార్థివ్‌ పటేల్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, డెక్కన్‌ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Follow Us
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి