Paralympics 2024: పారాలింపిక్స్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత క్రీడాకారులు.. హైజంప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన ప్రవీణ్ ..

|

Sep 06, 2024 | 7:16 PM

గత పారాలింపిక్స్‌లో ప్రవీణ్ రజత పతకం సాధించాడు. ప్రవీణ్ సాధించిన ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 26కి చేరుకోగా.. ఆరో బంగారు పతకంతో పతకాల పట్టికలో భారత్ మళ్లీ 14వ స్థానానికి చేరుకుంది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం నాడు, ప్రవీణ్ కుమార్ అద్భుతంగా జంప్ చేయడంతో పారాలింపిక్ గేమ్స్‌లో భారత్ మరో పతకాన్ని గెలుచుకుంది. ప్రవీణ్ 2.08 మీటర్లు దూకాడు. దీంతో కొత్త ఆసియా రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని కూడా సాధించాడు

Paralympics 2024: పారాలింపిక్స్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత క్రీడాకారులు.. హైజంప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన ప్రవీణ్ ..
Praveen Kumar
Image Credit source: Instagram/Praveen Kumar
Follow us on

పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024లో భారత క్రీడాకారులు అంచనాకు మించి రాణిస్తున్నారు. తాజాగా భారత్ పతకాల ఖాతాలోకి మరో పతకం అది కూడ పసిడి పతకం చేరింది. పురుషుల హైజంప్ టీ64 విభాగంలో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఈవెంట్ ఫైనల్లో ప్రవీణ్ 2.08 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. దీనితో పాటు టోక్యో పారాలింపిక్ గేమ్స్‌లో తాను సాధించిన మెడల్ రంగును మార్చుకోవడంలో ప్రవీణ్ విజయం సాధించాడు. గత పారాలింపిక్స్‌లో ప్రవీణ్ రజత పతకం సాధించాడు. ప్రవీణ్ సాధించిన ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 26కి చేరుకోగా.. ఆరో బంగారు పతకంతో పతకాల పట్టికలో భారత్ మళ్లీ 14వ స్థానానికి చేరుకుంది.

ఆసియా రికార్డుతో స్వర్ణం సాధించిన ప్రవీణ్..

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం నాడు, ప్రవీణ్ కుమార్ అద్భుతంగా జంప్ చేయడంతో పారాలింపిక్ గేమ్స్‌లో భారత్ మరో పతకాన్ని గెలుచుకుంది. ప్రవీణ్ 2.08 మీటర్లు దూకాడు. దీంతో కొత్త ఆసియా రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని కూడా సాధించాడు. ఈ ఈవెంట్‌లో ప్రవీణ్ మరో 5 మంది ఆటగాళ్లను వెనక్కి నెట్టి బంగారు పతకం సాధించాడు. అమెరికాకు చెందిన డెరెక్ లోసిడెంట్ (2.06 మీ) రజత పతకాన్ని గెలుచుకోగా.. ఇద్దరు క్రీడాకారులు కాంస్యం సాధించారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన తైమూర్‌బెక్ గియాజోవ్, పోలాండ్‌కు చెందిన మసీజ్ లెపియాతో సంయుక్తంగా 2.03 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నారు.

టోక్యో, హాంగ్‌జౌ తర్వాత పారిస్‌లో కూడా సక్సెస్ అందుకున్న ప్రవీణ్

కాళ్ల సమస్యలతో బాధపడుతున్న ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా గత మూడేళ్లు చాలా అద్భుతంగా ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించాడు. ఆ తర్వాత 2023లో హాంగ్‌జౌ పారా ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. ఇప్పుడు ప్రవీణ్ పారిస్‌లో హాంగ్‌జౌ ప్రదర్శనను పునరావృతం చేసి పారాలింపిక్ ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఈ పారాలింపిక్స్ 2024 లో భారత్‌ కు బంగారు పతకం అందించిన ఆరో అథ్లెట్‌గా నిలిచాడు.

పతకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉందంటే

ప్రవీణ్ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పారాలింపిక్ విజేతను అభినందించారు. ప్రవీణ్ పోరాట పటిమ దేశానికి విజయాన్ని అందించిందని అన్నారు. ప్రవీణ్ ఈ స్వర్ణంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 26కి చేరింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఇప్పటికే 19 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శనను దాటి ఈ పారిస్ పారాలింపిక్స్ 2024 లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ 6 బంగారు పతకాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. ప్రస్తుతం భారత్ 14వ స్థానంలో ఉంది. క్రీడలకు ఇంకా 2 రోజులు మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో పతకాల పట్టికలో భారతదేశం స్థానం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..