Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం.. జ్యోతి పట్టుకుని వీధుల్లో నడిచిన పారాలింపిక్స్ టెన్నిస్ స్టార్

|

Jul 25, 2024 | 4:29 PM

ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ కెవిన్ పియెట్ నడవలేడు. 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఈ ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ నడవగలిగే శక్తిని కోల్పోయాడు. అయినప్పటికీ.. కాళ్లు పోయినంత మాత్రాన.. నడవ లేనంత మాత్రాన జీవితం అంతటితో ఆగిపోదు అంటూ పది మందికి ఉదాహరణగా నిలిచాడు ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్. చేతిలో టార్చ్ పట్టుకుని పారిస్ వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించాడు. నడవని వ్యక్తి పరుగులు తీయడం అనే అద్భుతం ఎలా జరిగింది అనేది ప్రశ్న.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం.. జ్యోతి పట్టుకుని వీధుల్లో నడిచిన పారాలింపిక్స్ టెన్నిస్ స్టార్
Tennis Player Kevin Piette
Follow us on

మరికొన్ని గంటల్లో పారిస్ లో ఒలింపిక్స్ సంబరాలు మొదలు కానున్నాయి. వేసవి ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకకు ముందు చాలా మంది ప్రసిద్ధ ఆటగాళ్లు ప్యారిస్ వీధుల్లో టార్చ్‌లతో పరుగెత్తడం కనిపించింది. ఆ ఆటగాళ్ళలో ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ కెవిన్ పియెట్ ఒకడు. అతను నడవలేడు. 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఈ ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ నడవగలిగే శక్తిని కోల్పోయాడు. అయినప్పటికీ.. కాళ్లు పోయినంత మాత్రాన.. నడవ లేనంత మాత్రాన జీవితం అంతటితో ఆగిపోదు అంటూ పది మందికి ఉదాహరణగా నిలిచాడు ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్. చేతిలో టార్చ్ పట్టుకుని పారిస్ వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించాడు. నడవని వ్యక్తి పరుగులు తీయడం అనే అద్భుతం ఎలా జరిగింది అనేది ప్రశ్న.

ప్యారిస్ ఒలింపిక్స్ టార్చ్ రిలేలోలో వికలాంగ అథ్లెట్

ఇవి కూడా చదవండి

ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. సాంకేతికంగా విభిన్న రీతిలో సామర్థ్యం పొందుతోంది. కెవిన్ పియెట్ కూడా ఒక టెక్నిక్ సహాయంతో పారిస్ ఒలింపిక్స్ టార్చ్ మార్చ్‌లో పాల్గొన్నాడు. ఒలింపిక్ టార్చ్‌తో పరుగెత్తడానికి.. అతను రోబోటిక్ ఎక్సోస్కెలిటన్‌ను ఉపయోగించాడు. కెవిన్ ఇంతకుముందు నుంచి కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు.

చరిత్ర సృష్టించిన ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ కెవిన్ పియెట్

కెవిన్ పియెట్ కూడా రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ ద్వారా పారిస్ ఒలింపిక్స్ టార్చ్ రిలేలో పరుగెత్తడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి, అతను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిగెత్తిన మొదటి అథ్లెట్ అయ్యాడు.

కెవిన్ పియెట్ తన ఎక్సోస్కెలిటన్‌తో ఒలింపిక్ జ్యోతిని మోసుకెళ్లి చరిత్ర సృష్టించాడు

ఫ్రెంచ్ పారాలింపిక్స్ టెన్నిస్ స్టార్ కెవిన్ పీట్ పారిస్‌లో చేసిన ఫీట్… అతని దైర్యం.. ఇతర దివ్యాంగులతో పాటు ఇతర పారా క్రీడాకారులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పుడు, మరికొందరు దివ్యాంగ ఆటగాళ్లు తదుపరి ఒలింపిక్స్‌లో టార్చ్ మార్చ్‌లో భాగం అయ్యే చాన్స్ ఉంది అందడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆశ్చర్య పడాల్సిన అవసరం అసలే ఉండదు.

ఎక్సోస్కెలిటన్ ఎలా పని చేస్తుంది?

రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ వికలాంగులు లేదా వృద్ధులు నడవడానికి సహాయపడుతుంది. ఇది వైకల్యాన్ని పూర్తిగా తొలగించదు కానీ అది వారిని స్వావలంబనగా మారేలా చేస్తుంది. కెవిన్ పియెట్ కూడా రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ సహాయంతో టార్చ్ రిలేలో ఇలాంటి స్వీయ-విశ్వాసాన్ని చూపించాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..