Paris olympics 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌ ఫోగాట్.. భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసిన స్టార్ రెజ్లర్

|

Aug 06, 2024 | 11:12 PM

పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఈ స్టార్ రెజ్లర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం (ఆగస్టు 06) రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వినేశ్‌ ఫోగట్ 5-0 తేడాతో యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది

Paris olympics 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌ ఫోగాట్.. భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసిన స్టార్ రెజ్లర్
Vinesh Phogat
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఈ స్టార్ రెజ్లర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం (ఆగస్టు 06) రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వినేశ్‌ ఫోగట్ 5-0 తేడాతో యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో ఇదే తొలి పతకం కానుంది. మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 29 ఏళ్ల వినేష్ మంగళవారం (ఆగస్టు 6వ తేదీ) తన  పోరాటాన్ని ప్రారంభించింది. ఈ స్టార్ రెజ్లర్ తన తొలి మ్యాచ్‌లోనే ప్రస్తుత ఒలింపిక్, అలాగే 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్‌కు చెందిన యుయి సుసాకిని ఓడించి సంచలనం సృష్టించింది.  ఈ విజయాన్ని ఎవరూ ఊహించలేదు ఎందుకంటే 25 ఏళ్ల సుసాకి తన 82 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఆమెకు ఇదే తొలి ఓటమి. అనంతరం క్వార్టర్ ఫైనల్లో వినేష్ 7-5తో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై విజయం సాధించింద

ఈ ఫలితం తర్వాత, ఇప్పుడు పతకాన్ని ఆగస్టు 7వ తేదీ రాత్రి నిర్ణయించనున్నారు వినేష్ ఫోగాట్ 2016లో రియో ​​డి జనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది, అయితే మొదటి మ్యాచ్‌లోనే గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత, అతను సెమీ-ఫైనల్‌కు ముందే టోక్యో ఒలింపిక్స్‌లో ఓడిపోయాయింది. ఇప్పుడు, పారిస్‌లో అద్భుతాలు చేయడం ద్వారా, ఆమె ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి

 

 

వినేష్   విజయంతో ఈ ఒలింపిక్స్ లో  భారత్ కు మరో పతకం ఖాయమైంది. కాగా ఒలింపిక్స్ లో రెజ్లర్ల జోరు కొనసాగుతోంది. ఈ ఐదు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు మొత్తం 7 పతకాలు వచ్చాయి. వినేశ్  కంటే ముందు 2008లో సుశీల్ కుమార్ (కాంస్యం), 2012లో (రజతం), యోగేశ్వర్ దత్ (కాంస్యం) 2012లో, సాక్షి మాలిక్ (కాంస్యం) 2016లో, బజరంగ్ పునియా (కాంస్యం) 2020లో, రవి దహియా (రజతం) 2020లో పతకాలు సాధించారు. ఇప్పుడు వినేశ్ ఫొగోట్ కూడా ఈ జాబితాలో చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..