Viral Photo: 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా ఫొటో రికార్డు.. రొనాల్డోను బీట్ చేసిన అర్జెంటీనా స్టార్ ప్లేయర్!

|

Jul 20, 2021 | 9:49 AM

ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా రూపు రేఖలు మారిపోయాయి. డిజిటల్ మీడియా హవా కొనసాగుతోన్న ఈ రోజుల్లో.. సెలబ్రెటీలు ఏది పోస్టు చేసినా సంచలంగా మారిపోతోంది.

Viral Photo: 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా ఫొటో రికార్డు.. రొనాల్డోను బీట్ చేసిన అర్జెంటీనా స్టార్ ప్లేయర్!
Lionel Messi
Follow us on

Lionel Messi: ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా రూపు రేఖలు మారిపోయాయి. డిజిటల్ మీడియా హవా కొనసాగుతోన్న ఈ రోజుల్లో.. సెలబ్రెటీలు ఏది పోస్టు చేసినా సంచలంగా మారిపోతోంది. కామెంట్లు, లైకులతో రికార్డులు మీద రికార్డులు క్రియోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సెలబ్రెటీలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఓ సెలబ్రెటీ స్టార్ షేర్ చేసిన ఓ ఫొటో భలే రికార్డును సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫుల్‌బాల్ దిగ్గజాలైన రోనాల్డో, మెస్సీ సోషల్ మీడియాలో రికార్డులతో పోరాడుతున్నారు. రొనాల్డో క్రియోట్ చేసిన ఓ రికార్డును తాజాగా లియోనెల్ మెస్సీ బ్రేక్ చేశాడు. ఇటీవల కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనా టీం గెలిచిన సంగతి తెలసిందే. అయితే ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీ ట్రోఫీతో ఓ ఫొటో దిగాడు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అప్పటి నుంచి ఈ ఫొటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటో దాదాపు 20 మిలియన్లకు (2కోట్లకు) పైగా లైక్‌లు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అథ్లెట్ షేర్ చేసిన ఓ ఫొటోకు ఈ రేంజ్‌లో లైకులు రావడం ఇదే మొదటి సారి. ఈ రికార్డును మెస్సీ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో రికార్డు నెలకొల్పింది.

మరోవైపు గతంలో డీగో మారడోనా చనిపోయినప్పుడు నివాళిగా ఓ ఫొటోను రొనాల్డో పోస్ట్‌ చేశాడు. ఇప్పటివరకు రోనాల్డో, మారడోనా ఫొటోకు 19.8 మిలియన్లకు (1. 98 కోట్ల) పైగా లైక్‌లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు మెస్సి ఫొటోపై ఉంది. తాజాగా లియోనెల్ మెస్సీ ఫొటో బ్రేక్ చేసింది. కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌పై లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా టీం విజయం సాధించిన సంగతి విదితమే. దీంతో మెస్సి తన కెరీర్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో 4 గోల్స్‌ చేసి లియోనెల్ మెస్సీ.. అర్జెంటీనా గెలుపులో కీలక పాత్ర పోషించి, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచాడు.

Also Read:

IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!

IND Vs SL: టీమిండియా వన్డే చరిత్రలో మొదటివాడిగా పృథ్వీ షా.. సెహ్వాగ్, రోహిత్‌లకు సాధ్యం కాని అరుదైన రికార్డు ఏంటో తెలుసా..!