Russia-Ukraine war: ఉక్రెయిన్‌ రక్షణ కోసం రాకెట్‌ విడిచి, ఆయుధాలు చేతపట్టిన టెన్నిస్ స్టార్ ప్లేయర్..

|

Mar 29, 2022 | 7:30 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగి నేటికి 34 రోజులకు చేరింది. ఈ 34 రోజుల్లో లక్షలాది మంది ఉక్రేనియన్ పౌరుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. సినిమా స్టార్ల నుంచి ఎందరో క్రీడాకారుల వరకు తమ దేశం కోసం రణరంగంలోకి దిగారు.

Russia-Ukraine war: ఉక్రెయిన్‌ రక్షణ కోసం రాకెట్‌ విడిచి, ఆయుధాలు చేతపట్టిన టెన్నిస్ స్టార్ ప్లేయర్..
Sergiy Stakhovsky Try To Defend Kyiv
Follow us on

Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగి నేటికి 34 రోజులకు చేరింది. ఈ 34 రోజుల్లో లక్షలాది మంది ఉక్రేనియన్ పౌరుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. సినిమా స్టార్ల నుంచి ఎందరో క్రీడాకారుల వరకు తమ దేశం కోసం రణరంగంలోకి దిగారు. ఇందులో తాజాగా టెన్నిస్(Tennis) ఆటగాడు సెర్గీ స్టాఖోవ్‌స్కీ చేరాడు. 2013 వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్‌ను ఓడించిన సెర్గీ స్టాఖోవ్‌స్కీ(Sergiy Stakhovsky), దేశాన్ని రక్షించడానికి తన కెరీర్‌ను వదులుకున్నాడు. రాజధాని కైవ్ వీధుల్లో, సెర్గీ, సైనిక దుస్తులు ధరించి, చేతిలో ఆయుధాలతో శత్రువులను ఎదుర్కొంటున్నాడు.

ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే, చరిత్ర నుంచి కూడా పోయినట్లే..

సెర్గీ స్టాఖోవ్స్కీ తన జీవితంలోని ఈ కొత్త ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, మేం మూడు నుంచి ఐదుగురు వ్యక్తుల సమూహాలుగా విడపోయాం. మేం పెట్రోలింగ్ చేస్తున్నాం. అందరికి రెండు గంటల షిఫ్ట్, ఆ తర్వాత ఆరు గంటల విశ్రాంతి, తర్వాత రెండు గంటలు బయటకు వెళ్లాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే చరిత్ర పుస్తకాల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోతుందని సెర్గీ చెప్పారు. ఇది ఒక దేశంగా భూమి నుంచి అదృశ్యమవుతుంది. రష్యన్ ఏజెంట్లు, దొంగలు దుకాణాలలోకి ప్రవేశించకుండా మేం నిరోధిస్తాం’ అంటూ వెల్లడించాడు.

జనవరిలో టెన్నిస్ నుంచి రిటైర్ కావడానికి కొద్దిసేపటి ముందు, సెర్గీ స్టాఖోవ్స్కీ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ, ‘నేను నా దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సైనిక అనుభవం లేదు. కానీ, నాకు వ్యక్తిగతంగా తుపాకీలతో టచ్ ఉంది. మా నాన్న, అన్నయ్య డాక్టర్లు. వారు ఒత్తిడిలో ఉన్నారు. నేలమాళిగలో నిద్రిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

2013 వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్‌ను ఓడించిన సెర్గీ స్టాఖోవ్‌స్కీ..

2013లో జరిగిన వింబుల్డన్‌లో సెర్గీ స్టాఖోవ్‌స్కీ రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు. ఈ 36 ఏళ్ల స్టాఖోవ్‌స్కీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత జనవరిలో రిటైరయ్యాడు. రెండుసార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత బాక్సర్ వాసిలీ లోమచెంకో, టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ డోల్గోపోలోవ్ కూడా ఉక్రెయిన్ సైన్యంలో చేరారు.

Also Read: SRH vs RR Live Score, IPL 2022: టాస్ గెలిచిన హైదరాబాద్.. ప్లేయింగ్‌ XIలో ఎవరున్నారంటే?

Watch Video: ఐపీఎల్‌కు ముందు పొట్టుపొట్టు తిట్టుకున్నారు.. ఇప్పుడేమో హగ్‌లతో ఫ్రెండ్స్ అయ్యారు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..