Pakistani Snooker Player Majid Ali: పాకిస్థాన్ స్నూకర్ ప్లేయర్ మజీద్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. పాకిస్తాన్ అత్యుత్తమ స్నూకర్ ఆటగాళ్ళలో ఒకరిగా పేరుగాంచిన మజీద్.. U-21 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. 28 ఏళ్ల మజీద్ ఫైసలాబాద్‌లో శవమై కనిపించడంతో అంతా షాకయ్యారు.
మజీద్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. పాక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మజీద్ చెట్లను కోసే యంత్రాన్ని ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నాడు. మజీద్ అనేక అంతర్జాతీయ వేదికలలో పాకిస్థాన్ తరపున బరిలోకి దిగాడు. జాతీయ స్థాయిలో స్నూకర్‌లో మజీద్ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.
ఒక నెల వ్యవధిలో పాకిస్థాన్‌లో మరణించిన రెండో స్నూకర్ ఆటగాడిగా మజీద్ నిలిచాడు. గత నెలలో అంతర్జాతీయ స్టార్ ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో కన్నుమూశారు. నటుడి సోదరుడు ఉమర్ మాట్లాడుతూ.. మజీద్ యుక్తవయస్సులో ఉన్నప్పటి నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. మజీద్ మృతికి పాకిస్థాన్ బిలియర్డ్స్, స్నూకర్ చైర్మన్ అలంగీర్ షేక్ సంతాపం తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..