
భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగల్ ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేక పోయాడు. పారిస్‌లో జరుగుతున్న క్వాలిఫయింగ్ పోటీల్లో ఓటమిని చవిచూశాడు. ఎన్నో ఆశలతో అక్కడి వెళ్లిన సుమిత్ నిరాశే మిగిలింది. జరిగిన రెండు సెట్లలోనూ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. అలేజేండ్రో తబిలో(చిలీ) చేతిలో వరుస సెట్లలో 3-6, 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. రామ్‌కుమార్ రామ్‌నాథన్, ప్రజ్ఞేశ్ , అంకిత రానా ఇప్పటికే ఈ పోటీల నుంచి నిష్క్రమించారు.
ఫ్రెంచ్ ఓపెన్(FRENCH OPEN)లో పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా కు రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ మాత్రమే అర్హత సాధించారు. ఈ టోర్నీలో సానియా మీర్జా(Sania mirza) పాల్గొనట్లేదు. అయితే తన స్పెషల్ ర్యాంకింగ్‌తో వింబుల్డన్ (wimbledon) ఛాంపియన్షిప్ఆడాలని సానియా చూస్తోంది.