Olympic Doping Scandal: 15 ఏళ్ల యంగ్ అథ్లెట్ ఆమె. వింటర్ ఒలింపిక్స్‌లో అద్భుతం చేసిన రోజే.. ఆమె ఫేట్ తిరగబడింది. ఆ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్త అథ్లెట్లకు ఓ గుణపాఠంగా మారింది. అంతేకాదు.. రోజుకో మలుపు తిరుగుతూ.. నెక్ట్స్ ఏం జరుగుందా? అని యావత్ ప్రపంచ క్రీడాలోకం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకెళితే.. రష్యన్ స్కేటర్ వలియేవా డోపింగ్ వివాదం ముదురుతోంది. ఈ యంగ్ స్కేటర్ బీజింగ్ వదిలి తాజాగా రష్యాలో అడుగుపెట్టింది. డోపింగ్ వివాదం తర్వాత తొలిసారి స్వదేశం వచ్చిన వలియేవాకు ఘనస్వాగతం పలికారు రష్యన్లు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కి ముందు వలియేవాపై ఎన్నో ఆశలున్నాయి. స్కేటింగ్‌లో ఈ సారి పతకాలన్నీ వలియేవాకే వస్తాయని అంతా అనుకున్నారు. కాని వింటర్ ఒలింపిక్స్ జరిగే సమయంలో వలియేవా డోపింగ్‌లో దొరికిపోయింది. నిషేదిత ఉత్ప్రేరకాలు వాడినట్లు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ ప్రకటించింది.
అయితే, ఈ వివాదం నేపథ్యంలోనే రష్యన్ ఒలింపిక్ అసోసియేషన్ ముందుగా ఆమెపై నిషేధం విధించింది. తర్వాతి రోజు నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆమె పోటీల్లో పాల్గొనడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్, స్కేటింగ్ యూనియన్, వాడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కోర్టులో ఫిర్యాదు చేశాయి. వాదనలు విన్నాక కోర్టు ఆమెను ఆటల్లో పాల్గొనేందుకు అనుమతించింది. 15 ఏళ్ల టీనేజర్‌పై నిషేధం విధిస్తే ఆమె భవిష్యత్ దారుణంగా ఉంటుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది.
నిజానికి వలియేవా గుండె సంబంధిత ఉత్ప్రేరకాలు తీసుకుంది. దీనివల్ల ఆటలాడే సమయంలో రక్తప్రసరణ సాధారణం కన్నా ఎక్కువగా ఉండి.. శరీరానికి మరింత ఉత్తేజాన్నిస్తుంది. ఇలాంటి ప్రమాదకర డ్రగ్స్ చిన్నారులకు ఇచ్చి వారిని అథ్లెట్లుగా తయారుచేస్తున్నారని, వారు ఎదిగేకొద్దీ శారీరక, మానసిక రోగాల బారిన పడతారంటున్నారు నిపుణులు. ఈ డోపింగ్‌కి ముందు ఆమె ఒలింపిక్స్‌లోనే సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఫిగర్ స్కేటింగ్ ఈవెంట్లో క్వాడ్రపుల్ జంప్ చేసిన తొలి మహిళా స్కేటర్‌గా చరిత్రకెక్కింది. తర్వాతిరోజే ఆమె చరిత్ర తిరగబడింది. చివరి గేమ్‌లో కనీసం పెర్ఫామెన్స్ చేయలేక చతికిలపడింది వలియేవా.
Also read:
చేతుల్లో భోజనం ప్లేట్స్ పెట్టుకొని శ్రీవల్లి హూక్ స్టెప్ !! అదరగొట్టారు.. వీడియో
SSC CHSL 2021కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యమైన ప్రకటన! వెంటనే ప్రారంభించండి..
Ashu Reddy: మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న అషు లేటెస్ట్ ఫోటోస్