Tokyo 2020 Summer Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఈసారి పతకం గెలవడం అంత తేలికకాదని మాజీ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అభిప్రాయపడింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధుపై ఎంతో ఒత్తిడి ఉంటోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అలాగే సింధుకి తగిన ప్రాక్టీస్ లేకపోవడంతో… ఈ సారి పతకం సాధించాలంటే చాలా కష్టమవుతోందని, ఒత్తడిని జయిస్తేనే ఒలింపిక్స్‌లో పతకం సాధ్యమని’ జ్వాలా అంది. “ఈ స్టార్ బ్యాడ్మింటన్‌పై అందరి దృష్టి ఉందని, దీంతో ఆమెపై చాలా ఒత్తిడి ఉందని, కోచ్‌ల విషయంలోనూ గందరగోళ పరిస్థితుల్లో ఆమె చిక్కుకుందని” ఆమె వెల్లడించింది. “ప్రస్తుతం సింధులో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, కరోనా వైరస్‌తో భారత ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ దొరకలేదని, సరైన ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడంతో ఒత్తిడి పెరుగుతుందని” పేర్కొంది. ప్రాక్టీస్ విషయంతో ఆటగాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇలా కాకుంటే గత మ్యాచ్‌ల వీడియోలు చూస్తూ పథకాలు రచించుకోవాలని సలహా ఇచ్చింది. రియో ఒలంపిక్ క్రీడలలో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌పై అందరి దృష్టి ఉంది. కానీ, అనూహ్యంగా పీవీ సింధు రజత పతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ జులై 23 నుంచి టోక్యో లో ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ సారి పీవీ సింధు బిలియన్ ప్రజల ఆశలను మోసుకెళ్తుందనండంలో సందేహం లేదు. ఆమె పై ఎంతో ఒత్తిడి ఉంటుందనేది సత్యం.
“కోవిడ్ సెకండ్ వేవ్‌తో భారతీయ ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లు జరగలేదు. కానీ, ఐరోపాలో కొన్ని టోర్నమెంట్లు జరిగాయి. భారత్ ఆటగాళ్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో వారు ఏ టోర్నమెంట్‌లకు వెళ్లలేదు. చైనా, కొరియన్ దేశాల్లో 20 నుంచి 30 మంది ఆటగాళ్లు పాల్గొంటుంటారు. వారంతా ఎంతో కష్టపడి గేమ్స్‌లో పాల్గొంటుంటారు. కొరియన్లు, థాయ్ అమ్మాయిలు బాగా ఆడుతున్నారు. అలాగే జపాన్ ఆటగాళ్లు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ, మన దగ్గర మాత్రం కేవలం కొద్ది మంది ప్లేయర్లే బరిలోకి దిగడం చాలా విచారకరమని, అందులో ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం ఏంటని” జ్వాలా అభిప్రాయపడింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ, జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ గోపీచంద్ పై ఆరోపణలు గుప్పించింది. “సింధు తర్వాత ఎవరంటే మాత్రం సమాధానం చెప్పరని, సరైన బ్యాడ్మింటన్ విధానాన్ని తయారుచేయడంలో విఫలమయ్యాడని” పేర్కొంది. మన దగ్గర ఎక్స్‌పీరియన్స్ గల కోచ్‌లు లేరని, ఆటగాళ్లకు కూడా సరైన గుర్తింపు కావాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ కేవలం ఒక్క అకాడమీకే అలాంటి పేరు, గుర్తింపు దక్కుతోందని విమర్శిచింది. “ఓ ప్రధాన కోచ్ స్వంతంగా ప్రైవేటు అకాడమీని నిర్వహించకూడదు. అలాగే జాతీయ శిబిరాన్ని అందులో నడిపించకూడదు. కానీ, ఇక్కడ అవన్నీ జరుగుతున్నాయని, 2006 నుంచి ఇదే తంతు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరని” నిప్పులు చెరిగింది. “మొత్తం డబ్బు, వనరులు గోపీచంద్ అకాడమీకే ఇచ్చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఒక్క డబుల్స్ ప్లేయర్‌ను కూడా దేశానికి అందివ్వలేకపోయాడు. అందుకే ఆ పదవిలో ఉండేందుకు గోపిచంద్ అర్హుడు కాదని” జ్వాల పేర్కొంది.
Also Read:
IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…
WTC Final 2021: పుజారాపై పేలుతోన్న మీమ్స్.. ఒక్క పరుగు కోసం అన్ని బంతులా!
WTC Final 2021: పుజారాకు తప్పిన ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్! వీడియో వైరల్