Cristiano Ronaldo: గుడ్ న్యూస్ చెప్పిన క్రిస్టియానో ​​రొనాల్డో.. నాలుగోసారి తండ్రి కాబోతోన్న స్టార్ ప్లేయర్..!

పోర్చుగీస్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు.

Cristiano Ronaldo: గుడ్ న్యూస్ చెప్పిన క్రిస్టియానో ​​రొనాల్డో.. నాలుగోసారి తండ్రి కాబోతోన్న స్టార్ ప్లేయర్..!
Cristiano Ronaldo

Updated on: Oct 30, 2021 | 4:56 PM

Cristiano Ronaldo: పోర్చుగీస్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. అది కూడా కవలలు పుట్టబోతున్నారంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు కవలలు కావడం విశేషం. తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అని, అలాగే మాకు కవలలు పుట్టబోతున్నారని సోషల్ మీడియాలో గురువారం ప్రకటించాడు. 36 ఏళ్ రొనాల్డో ఈమేరకు ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. “మాకు కవలలు పుట్టుబోతున్నందుకు ఆనందంగా ఉంది. మా హృదయాలు ప్రేమతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కలవడానికి మేం వేచి ఉండలేమం” అంటూ క్యాప్షన్ అందించాడు.

ఇప్పటికే క్రిస్టియానో జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఇద్దరు కవలలు కావడం, మరోసారి కవలలే పుట్టనుండడం విశేషం. ఈమేరకు స్కానింగ్‌కు సంబంధించిన ఫొటోను చూపిస్తూ తన భాగస్వామితో ఫొటోను షేర్ చేసుకున్నాడు. అలాగే మరో ఫొటోలో తన నలుగురు పిల్లలతో స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. జూనియర్ క్రిస్టియానో, అలానా మార్టినాతోపాటు కవలలు ఎవా మారియా, మాటియాలు కూడా ఉన్నారు. అయితే జూలైలో కోపా అమెరికా విజయానికి సంబంధించి లియోనెల్ మెస్సీ షేర్ చేసి ఓ ఫొటో 22.1 మిలియన్ లైక్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డులపై రికార్డులు నెలకొల్పింది. రోడ్రిగ్జ్ ప్రెగ్రెంట్ అంటూ షేర్ చేసిన ఫొటో 26.5 మిలియన్ల లైక్‌లను అందుకోవడంతో మెస్సీ తన రికార్డును తనే అధిగమించాడు.

Also Read: IND vs NZ, T20 World Cup 2021: అలాంటి వారి కోసం మా సమయాన్ని వృధా చేసుకోం: ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ

SA vs SL Live Score, T20 World Cup 2021: షమ్సీ దెబ్బకు ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసరంగ (4) ఔట్.. 13.4 ఓవర్లకు 91/5