Paris Paralympics 2024 Medal Tally: పారిస్ పారాలింపిక్స్ 2024లో ఇప్పటివరకు భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ ఇప్పటి వరకు వివిధ ఈవెంట్లలో ఎన్నో పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌తో పోలిస్తే పారాలింపియన్లు మెరుగైన ఫలితాలు అందించారు. ఈ కారణంగా పతకాల పట్టికలో భారత్ స్థానం కూడా బాగానే ఉంది.
పారిస్ పారాలింపిక్స్‌లో దీప్తి జీవన్‌జీ భారత్‌కు 16వ పతకాన్ని అందించింది. 400 మీటర్ల ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. పారాలింపిక్స్‌లో ఆమెకిది తొలి పతకం. దీంతో దీప్తి కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళల 400 మీటర్ల టీ20 రేసులో భారత్ నుంచి పతకం సాధించిన తొలి పారా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఈ ఈవెంట్‌లో ఏ పారా అథ్లెట్ పతకం సాధించలేదు. కానీ, దీప్తి మాత్రం ఈ ఘనత సాధించింది.
దీప్తి అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల సంఖ్య 16కి చేరింది. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్య పతకాలు సాధించింది. ఇప్పటి వరకు పారా అథ్లెటిక్స్‌లో మాత్రమే భారత్ అత్యధిక పతకాలు సాధించింది. అథ్లెటిక్స్‌లో భారత్ మొత్తం 6 పతకాలు సాధించింది. ఆ తర్వాత, పారా బ్యాడ్మింటన్ రెండవ స్థానంలో ఉంది. ఇందులో భారతదేశం 5 పతకాలు సాధించింది. షూటింగ్ పారా స్పోర్ట్‌లో 4 పతకాలు, పారా ఆర్చరీలో ఒక పతకం సాధించారు. మొత్తం పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 18వ స్థానంలో ఉంది. అయితే ఇది చాలా వేగంగా మారుతుంది.
చైనా ఇప్పటి వరకు 50 స్వర్ణాలు, 37 రజతాలు, 20 కాంస్య పతకాలు సాధించింది. మొత్తం 107 పతకాలతో చైనా నంబర్ వన్ స్థానంలో ఉంది. గ్రేట్ బ్రిటన్ 57 పతకాలతో రెండో స్థానంలో, అమెరికా 50 పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి. బ్రెజిల్ 44 పతకాలతో నాలుగో స్థానంలో, ఆతిథ్య ఫ్రాన్స్ 37 పతకాలతో ఐదో స్థానంలో ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..