Neeraj Chopra Meets Randeep Hooda: ఫేవరేట్ హీరోని కలుసుకున్న భారత స్టార్ అథ్లెట్..!

|

Aug 26, 2021 | 3:06 PM

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎట్టకేలకు తన ఫేవరేట్ హీరోని బుధవారం కలుసుకున్నాడు.

Neeraj Chopra Meets Randeep Hooda: ఫేవరేట్ హీరోని కలుసుకున్న భారత స్టార్ అథ్లెట్..!
Actor Randeep Hooda Neeraj Chopra
Follow us on

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎట్టకేలకు తన ఫేవరేట్ హీరోని బుధవారం కలుసుకున్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోను తన అభిమాన హీరోనే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అసలు విషయానికి వెళ్తే.. నీరజ్ చోప్రాకు హీరో రణ్‌దీప్‌ హుడా అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. ఎప్పటి నుంచో కలుసుకోవాలని ఉన్నా.. కుదరలేదు. ఇక టోక్యోలో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన తొలి భాతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో నీరజ్ చోప్రాకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. ఈ సందర్భంగా బుధవారం పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో తన అభిమాన హీరోని కలుసుకుని, తన సరదా తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్‌ హుడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ మేరకు నీరజ్‌చోప్రాను పొగద్తలతో ముంచెత్తాడు.

నీరజ్‌2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో మీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆ‍యన రణ్‌దీప్‌ హుడా నటిస్తే బాగుంటుందని ఆనాడే వెల్లడించాడు. వీరిద్దరూ హర్యానా రాష్ట్రానికే చెందిన వారే కావడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో నీరజ్ మాట్లాడుతూ తన అభిమాన హీరోపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించాడు. ఇంగీ​ష్‌, పంజాబీ, హిందీ భాషల్లో సినిమాలు చూస్తానని తెలిపాడు. తనకే హీరో రణ్‌దీప్‌ అంటే ఎంతో అభిమానం అని పేర్కొన్నాడు. అతను నటించిన ‘లాల్‌రంగ్‌’ సినిమా అంటే ఇష్టమని తెలిపాడు. లాల్‌రంగ్‌ సినిమా మొత్తం హరియాణా యాసలో ఉంటుందని, అందుకే ఆ సినిమా నాకు బాగా నచ్చిందని వెల్లడించాడు. అలాగే రణదీప్‌ నటించిన ‘సర్బజీత్‌’, ‘హైవే’ సినిమాలు బాగున్నాయని పేర్కొన్నాడు.

Also Read:

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ వాచ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ధరెంతో తెలుసా?

7వ స్థానంలో బరిలోకి.. 35 నిమిషాల్లోనే సెంచరీ.. బ్యాటింగ్‌లో దుమ్ము రేపిన ఆటగాడు.. ఎక్కడో తెలుసా?

PAK vs WI: పాకిస్తాన్‌కు షాక్.. వెస్టిండీస్ పర్యటనలో కరోనా బారిన సీనియర్ ఆటగాడు..!