Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా.. సుదీర్ఘ విరామం తర్వాత శిక్షణ ప్రారంభించాడు. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక బంగారు పతకం సాధించిన తరువాత ఎన్‌ఐఎస్ పాటియాలాలో శిక్షణకు తిరిగి వచ్చాడు. ఆగస్టు 7 న టోక్యోలో జరిగిన చారిత్రాత్మక విజయం తర్వాత నీరజ్ విరామం తీసుకున్నాడు. అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయుడు, టోక్యోలో ఒలింపిక్ బంగారు పతకం సాధించిన రెండవ భారతీయుడు నిలిచిన సంగతి తెలిసిందే.
ఈమేరకు ట్విట్టర్‌లో తన శిక్షణకు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకుంటూ, “అదే ఆకలితో ఈ వారం శిక్షణకు తిరిగి వచ్చాను. గత ఒలింపిక్ ఫాంతోనే శిక్షణను ప్రారంభిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు” అని నీరజ్ చోప్రా రాసుకొచ్చాడు.
జావెలిన్ త్రోలో స్వర్ణం
టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో, అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. నీరజ్ భారతదేశానికి వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించిన రెండవ అథ్లెట్. నీరజ్ కంటే ముందు, అభినవ్ బింద్రా 13 సంవత్సరాల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు.
నీరజ్ చోప్రా హర్యానాలోని పానిపట్‌లో నివాసం ఉంటున్నాడు. నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జావెలిన్ త్రోయర్‌లో పోటీ పడ్డాడు. అంజూ బాబీ జార్జ్ తర్వాత అథ్లెటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్థాయిలో బంగారు పతకం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. 2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ 85.23 మీటర్ల జావెలిన్ త్రోతో బంగారు పతకం సాధించాడు. 2016 దక్షిణ ఆసియా క్రీడలలో 82.23 మీటర్ల జావెలిన్ త్రోతో బంగారు పతకాన్ని సాధించి, భారత జాతీయ రికార్డును సమం చేశాడు. 2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ 85.23 మీటర్ల జావెలిన్ త్రోతో బంగారు పతకం సాధించాడు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడలలో 86.47 మీటర్లు విసిరి ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
Returned to training this week with the same hunger and desire as before. A #throwback to the beginning of the last Olympic cycle is a good place to start! Thank you to everyone for your messages of support. ?? pic.twitter.com/gia4fP4SQD
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 20, 2021
Also Read: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ఆటగాడు.. భారత్‌పై డబుల్ సెంచరీ చేసి మరీ శిక్షకు గురయ్యాడు.. ఎందుకో తెలుసా?