Indian Sailor KC Ganapathy: భారత సెయిలర్‌ కేసీ గణపతి గురించి మీకు తెలియని విషయాలు..!

| Edited By: Anil kumar poka

Jul 05, 2021 | 5:53 PM

కేసీ గణపతి.. 25 ఏళ్ల భారత యువ సెయిలర్. ఈ ఏడాది టోక్యోలో తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నాడు. ఒమన్‌లో జరిగిన ముస్సానా ఓపెన్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

Indian Sailor KC Ganapathy: భారత సెయిలర్‌ కేసీ గణపతి గురించి మీకు తెలియని విషయాలు..!
Indian Salor Kc Ganapathy
Follow us on

Indian Sailor KC Ganapathy: కేసీ గణపతి.. 25 ఏళ్ల భారత యువ సెయిలర్. ఈ ఏడాది టోక్యోలో తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నాడు. ఒమన్‌లో జరిగిన ముస్సానా ఓపెన్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ప్రతిభ కారణంగానే ఈ సారి ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించాడు కేసీ గణపతి. పురుషుల 49 ఈఆర్ ఈవెంట్‌లో వరుణ్ ఠక్కర్‌తో తొలిసారి భాగస్వామి కానున్నాడు కేసీ గణపతి. ఈ సందర్భంగా ఈ యువ సెయిలర్ గురించి మీరు తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. కేసీ గణపతి తమిళనాడులోని చెన్నై లో 18 నవంబర్ 1995 లో జన్మించాడు. కేసీ గణపతికి నౌకాయానం అంటే చాలా ఇష్టం. దీనికోసం పాఠశాల చదువుకు స్వస్తి చెప్పాడు. తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత అంతా ఓపెన్‌లోనే చదువు కొనసాగించాడు.

కె.సి గణపతి, వరుణ్ ఠక్కర్ లు 2011 లో శిక్షణ ప్రారంభించారు. అప్పట్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీపడేవారు. వారంలో ఆరు రోజులు చెన్నైలో ప్రాక్టీస్ చేసేవారు. కె.సి. గణపతి ఫిటెనెస్‌ కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడడు. సహజంగా దొరికే వాటినే తింటాడు. అల్పాహారంలో గుడ్లు లేదా పండ్లను తీసుకుంటాడు. ఉదయాన్నే వ్యాయామానికి ముందు వోట్స్ లేదా రాగి పిండిని తీసుకుంటాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల 49er ఈవెంట్‌లో వరుణ్ ఠక్కర్‌తో పాటు కేసీ గణపతి పాల్గొంటున్నాడు. ముస్సానా ఓపెన్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానంలో నిలిచినందుకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు ఈ యువ సెయిలర్. పురుషుల 49er ఈవెంట్‌లో వరుణ్ ఠక్కర్‌తో కలిసి కేసీ గణపతి ఆసియా గేమ్స్ 2018 లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

Also Read:

WTC Final 2021: పుజారాకు తప్పిన ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్! వీడియో వైరల్

Tokyo Olympics: టోక్యో ‘ఒలింపిక్ విలేజ్‌’ ఫొటోలు విడుదల! జులై 23 నుంచి ఒలింపిక్ గేమ్స్