కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్లు.. ఎప్పుడు, ఎక్కడంటే?

TV9 Indian Tigers and Tigresses: 5ఈ ట్యాలెంట్ హంట్‌ ప్రోగాంలో మొత్తం 50,000 రిజిస్ట్రేషన్లు అందగా.. 10,000 మంది ప్లేయర్లను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రాంతీయ ట్రయల్స్‌లో భాగంగా కేవలం 28 మంది మాత్రమే ఆస్ట్రియా పర్యటనకు చోటు దక్కించుకున్నారు.

కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
Indian Tigers And Tigresses

Updated on: Apr 02, 2025 | 9:58 PM

TV9 Indian Tigers and Tigresses: ఆస్ట్రియాలోని గ్ముండెన్‌లో కఠినమైన పరిస్థితులలో రెండు రోజుల పాటు శిక్షణ పొందిన భారత యంగ్ ప్లేయర్లు.. ఏప్రిల్ 2 బుధవారం నాడు యూరోపియన్ జగ్గర్‌నాట్‌లతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలోని యువ ప్రతిభను వెలికితీసేందుకు టీవీ9 తీసుకున్న ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్‌‌ ట్యాలెంట్ హంట్‌లో మొత్తం 28 మంది యంగ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. ఇందులో 12 మంది బాలికలు, 16 మంది బాలురు ఉన్నారు. వీరు రెండు మ్యాచ్‌లలో గ్ముండెన్ ఫుట్‌బాల్ అకాడమీతో ఆడేందుకు రెడీ అయ్యారు.

మొదటి మ్యాచ్‌లో అండర్-13 ఏజ్ గ్రూప్‌లో ఇండియన్ టైగ్రెస్‌లు గ్ముండెన్ అకాడమీ బాలికలతో తలపడనుండగా.. రెండవ మ్యాచ్‌లో అండర్-15 ఏజ్ ​​గ్రూప్‌లో ఇండియన్ టైగర్స్, గ్ముండెన్ అకాడమీ బాలుర మధ్య బ్లాక్‌బస్టర్ పోరు జరగనుంది.

కఠిన శిక్షణతో సిద్ధమైన యువ తారలు..

ఈ మ్యాచ్‌లకు ముందు, భారతదేశ యువ ఫుట్‌బాల్ ఛాంపియన్‌లు చివరి శిక్షణా సెషన్‌లో పాల్గొన్నారు. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్‌లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ శిక్షణతో ఆస్ట్రియన్ ప్రత్యర్ధులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ యంగ్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్‌లు వారి జీవితంలోనే అతిపెద్ద మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ట్యాలెంట్ హంట్‌ ప్రోగాంలో మొత్తం 50,000 రిజిస్ట్రేషన్లు అందగా.. 10,000 మంది ప్లేయర్లను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రాంతీయ ట్రయల్స్‌లో భాగంగా కేవలం 28 మంది మాత్రమే ఆస్ట్రియా పర్యటనకు చోటు దక్కించుకున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..