Shooter Konica Layak: మరో నేషనల్‌ షూటర్‌ ఆత్మహత్మ.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోనికా..

జాతీయ షూటర్‌ కోనికా లాయక్‌ కోల్‌కతాలో అనుమానస్పద స్థితిలో చనిపోయింది. కోల్‌కతాలోని హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తన తల్లిదండ్రులను క్షమించాలని..

Shooter Konica Layak: మరో నేషనల్‌ షూటర్‌ ఆత్మహత్మ.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోనికా..
Shooter Konica Layak

Updated on: Dec 16, 2021 | 6:03 PM

జాతీయ షూటర్‌ కోనికా లాయక్‌ కోల్‌కతాలో అనుమానస్పద స్థితిలో చనిపోయింది. కోల్‌కతాలోని హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తన తల్లిదండ్రులను క్షమించాలని సూసైడ్‌ లెటర్‌లో వేడుకుంది కోనికా లాయక్‌. షూటింగ్‌లో గత కొద్దికాలంగా తాను రాణించలేకపోతునట్టు అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్‌ లెటర్‌ రాసింది కోనికా. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్‌ స్టార్‌ సోనూ సూద్‌ రైఫిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు కోనికా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. జాతీయ షూటింగ్‌ పోటీలకు ఎంపికయినప్పటికి.. తన దగ్గర మంచి రైఫిల్‌ లేదని సోనూ సూద్‌ ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్‌ కోనికాకు రూ. 2.70 విలువైన రైఫిల్‌ను గిఫ్ట్‌గా పంపించారు.

ఆత్మహత్య ఘటనపై ఆమె కోచ్ జాయ్‌దీప్ ట్రిబ్యూన్ కోనికా కోచ్‌ స్పందించారు. ఆమె గత 10 రోజులుగా తన ప్రాక్టీస్ సెషన్‌లకు రెగ్యులర్‌గా రావడం లేదని తెలిపారు. ఆమె ప్రాక్టీస్‌లో బాగానే రాణిస్తున్నారని.. కానీ ఈ మధ్య కొద్ది రోజులుగా ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వస్తున్నట్లుగా తెలిపారు.

వెనుకబడిన జార్ఖండ్‌ ప్రాంతంలోని ధన్‌బాద్‌ నుంచి వచ్చిన కోనియా జాతీయ పోటీల్లో సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో మూడుసార్లు గోల్డ్‌ మెడల్‌ గెల్చుకున్నారు. కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతున్నారు.  

4 నెలల్లో ఇది నాల్గవ ఆత్మహత్య ఘటన. ఖుషీరత్ కౌర్ సంధు, హునర్‌దీప్ సింగ్ సోహల్ , నమన్‌వీర్ సింగ్ బ్రార్ కూడా ఆత్మహత్యతో మరణించారు. వీరంతా రాష్ట్ర స్థాయి షూటర్లు. 

ఇవి కూడా చదవండి: National Tourism Policy: భారత పర్యాటక రంగానికి కొత్త జవసత్వాలు.. మోదీ సర్కార్ కీలక విధాన నిర్ణయాలు..

Chiyaan Vikram : హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్.. సెలబ్రెటీలనూ వదలని మహమ్మారి