భారత బాక్సర్ల విమానం దిగేందుకు నో చెప్పిన దుబాయ్.. గాలిలోనే 45 నిమిషాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

May 22, 2021 | 7:45 PM

Indian Boxing Contingent: ఆసియన్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్ పోటీల​ కోసం భారత బాక్సర్ల జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే వీరిని చేరవేసిన   విమానం ల్యాండిగ్​కు దుబాయ్​ విమానాశ్రయ అధికారులు ముందుగా అనుమతి ఇవ్వలేదు.

భారత బాక్సర్ల విమానం దిగేందుకు నో చెప్పిన దుబాయ్.. గాలిలోనే 45 నిమిషాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Flight
Follow us on

ఆసియన్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్ పోటీల​ కోసం భారత బాక్సర్ల జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే వీరిని చేరవేసిన   విమానం ల్యాండిగ్​కు దుబాయ్​ విమానాశ్రయ అధికారులు ముందుగా అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానం 45 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.

కరోనా నిబంధనల నేపథ్యంలో బాక్సర్లు ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది యూఏఈ సర్కార్. దీంతో భారత బాక్సర్లు మేరీకోమ్​తో పాటు 30 మంది బృందం స్పైస్​జెట్​ విమానంలో దుబాయ్​కు చేరుకున్నారు. అయితే సమాచార లోపంతో యూఏఈ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్​కు అనుమతించలేదు. అక్కడి అధికారులు వివరణ ఇచ్చారు. అడ్డుకోవడానకి కారణం ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కారణమని తాజాగా స్పష్టం చేశారు.

Wealther update : ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రా, యానాం ప్రాంత ప్రజలకు రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు :

Shikhar Dhawan: బ్యాట్‌తోనే కాదు.. వేణువుతో ఆకట్టుకుంటున్న గబ్బర్.. కొత్త వీడియోను షేర్ చేసిన శిఖర్ ధావన్