Neeraj Chopra: చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆదివారం టోక్యో గేమ్స్‌లో తన చారిత్రాత్మక ఫీట్ సాధించి, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను సత్కరించింది. ఇందులో భాగంగా సీఎస్‌సే జెర్సీతోపాటు కోటి రూపాయలను బహుకరించింది. ఒలంపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని సాధించిన రెండో భారతీయ వ్యక్తిగా నీరజ్ చోప్రా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు షూటింగ్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకాన్ని సాధించి, తొలి భారతీయుడిగా పేరుగాంచాడు. అయితే జావెలిన్ త్రోను 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించినందుకు గుర్తుగా CSK 8758 నంబర్‌తో ప్రత్యేక జెర్సీని అందించింది.
“నీరజ్ అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు దేశం మొత్తం గర్విస్తోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం (స్వర్ణం) సాధించిన తొలి భారతీయుడిగా అవతరించి, ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు” అని సీఎస్‌కే సీఈవో కేఎస్ విశ్వనాథన్ అన్నారు.
“నీరజ్ తరువాతి తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. 8758 భారత క్రీడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సంఖ్య. నీరజ్‌కి ఈ నంబర్ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ప్రత్యేక జెర్సీని అందించడం మాకు ఎంతో గౌరవం. అతను దేశానికి మరింత కీర్తిని తీసుకురావాలని కోరుకుంటున్నాం” అని ఆయన తెలిపారు.
అవార్డు, ప్రత్యేక జెర్సీని అందుకున్న తర్వాత, 23 ఏళ్ల చోప్రా మాట్లాడుతూ, గత రెండు నెలలు ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం లభించింది. ఇందుకు మద్దతు ఇచ్చినందుకు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. “మీ మద్దతుకు చాలా ధన్యవాదాలు. ఎంతో ఆనందంగా అనిపిస్తొంది. స్వర్ణం గెలిచాక ఇంత ప్రేమ వస్తుందని అనుకోలేదు. ఇది అస్సలు ఊహించలేదు. గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. నేను కష్టపడి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తానని ఆశిస్తున్నాను” అని నీరజ్ అన్నారు.
ఆగస్టు 7న టోక్యోలో 87.58 మీటర్ల త్రోతో నీరజ్ చోప్రా ఒలింపిక్ క్రీడలలో అథ్లెటిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలిచిన సంగతి తెలిసిందే.
అలాగే కస్టమైజ్డ్ మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని ఆనంద్ మహీంద్ర అందించాడు. ఈ ఎక్స్‌యూవీకి కూడా 87.58 (అతని ఒలింపిక్స్ త్రో రికార్డు నంబర్) ముద్రించి అందించారు. ఈ మేరకు నీరజ్ తప కృతజ్ఞతను తెలియజేస్తూ, తన ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేశాడు. “కొన్ని ప్రత్యేకమైన మార్పులతో ఈ బహుమతిని అందించిన ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు( @anandmahindra Ji!).నేను అతి త్వరలో కారును బయటకు తీసుకరావడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు.
నీరజ్‌తో పాటు, టోక్యో పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ సుమిత్ యాంటిల్ మహీంద్రా XUV 700 ‘గోల్డెన్ జావెలిన్’ ఎడిషన్‌ను అందుకున్నాడు. “బీస్ట్ నా మొదటి SUV కారు. XUV700 గోల్డెన్ జావెలిన్ ఎడిషన్‌కు చాలా ధన్యవాదాలు @anandmahindra సర్. భవిష్యత్తులో మరింత మెరుగ్గా చేసేందుకు కష్టపడతాం. జై హింద్” అని సుమిత్ యాంటిల్ ట్వీట్ చేశాడు.
Thank you @anandmahindra ji for the new set of wheels with some very special customisation! I’m looking forward to taking the car out for a spin very soon. ? pic.twitter.com/doNwgOPogp
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 30, 2021
Thank you so much @anandmahindra sir for the beast? My first SUV car and its XUV700 Golden javelin edition?This will surely motivate me to do even mire better in future. JAI HIND? pic.twitter.com/UgQFg9WPbT
— Sumit antil (@sumit_javelin) October 31, 2021
IND vs NZ, Live Score, T20 World Cup 2021: దుబయ్ స్టేడియానికి బయలుదేరిన ఇరుజట్లు ఆటగాళ్లు..!