
US Open: యూఎస్ ఓపెన్ 2025 టైటిల్‌ను మరోసారి కార్లోస్ అల్కరాస్ గెలుచుకున్నాడు. ఇది అతనికి రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ టైటిల్ గెలవడానికి, అతను ఫైనల్‌లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ ను ఓడించాడు. ఈ విజయంతో అల్కరాస్ వరల్డ్ నంబర్ 1 ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పై స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాస్, యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్‌ను 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో గెలుచుకున్నాడు. ఇది అతనికి రెండో యూఎస్ ఓపెన్ టైటిల్, మొత్తం ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో అతను 65 వారాలుగా ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఉన్న సిన్నర్ ను వెనక్కి నెట్టేశాడు.
వీరిద్దరి మధ్య ఇది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఈ విజయంతో అల్కరాస్ 2-1 ఆధిక్యంలో ఉన్నాడు. హార్డ్ కోర్టులో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌లలో అల్కరాస్ 7-2తో సినర్‌పై ఆధిపత్యం కొనసాగించాడు. మొత్తం 15 మ్యాచ్‌లలో అల్కరాస్ 10-5తో సినర్‌పై ముందంజలో ఉన్నాడు.
US OPEN CHAMPION
WORLD NO.1
𝐂𝐀𝐑𝐋𝐎𝐒 𝐀𝐋𝐂𝐀𝐑𝐀𝐙 👑#USOpen pic.twitter.com/1UcGjcKl6N— Roland-Garros (@rolandgarros) September 7, 2025
Carlos Alcaraz defeats Jannik Sinner to reclaim the US Open title and the world No.1 ranking‼️ pic.twitter.com/oFTXrCeX7D
— US Open Tennis (@usopen) September 7, 2025
ఫైనల్ మ్యాచ్
మొత్తం 2 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో, మొదటి సెట్‌ను అల్కరాస్ సులభంగా గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో సినర్ పుంజుకున్నప్పటికీ, మూడో సెట్‌లో అల్కరాస్ 6-1తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. కీలకమైన నాలుగో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. ఒత్తిడిని అధిగమించిన అల్కరాస్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచాడు.
poppin' bottles with Carlos Alcaraz! 🍾 pic.twitter.com/NlDyrK6CzK
— US Open Tennis (@usopen) September 8, 2025
ఛాంపియన్ సెలెబ్రేషన్స్
యూఎస్ ఓపెన్ గెలిచి ప్రపంచ నంబర్ 1 అయిన కార్లోస్ అల్కరాస్ తన విజయాన్ని వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. అతను షాంపైన్ జల్లుతో పాటు కోర్టులో క్రికెట్ ఆడినట్లుగా సంబరాలు చేసుకున్నాడు. అల్కరాస్ విజయం తర్వాత ఒక బ్యాట్స్‌మెన్ ఎలాగైతే షాట్ ఆడతాడో, అదే విధంగా బ్యాట్ పట్టుకున్నట్లుగా పోజు ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సెలెబ్రేషన్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..