Asian Games 2023: అదరగొట్టిన అథ్లెట్స్.. 33 పతకాలతో 4వ స్థానం చేరిన భారత్.. డబుల్ సెంచరీ కొట్టిన చైనా..

Asian Games 2023: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఫైనల్‌లో భారత షూటర్లు స్వర్ణం, రజత పతకాలను గెలుచుకున్నారు. 242.1 పాయింట్లు సాధించిన పాలక్ స్వర్ణం కైవసం చేసుకోగా, అలాగే మరో ప్లేయర్ ఈషా సింగ్ 239.7 పాయింట్లతో రజతం గెలుచుకుంది. తర్వాత జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్‌లతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్‌తో 1-2తో ఓడి కాంస్యం సాధించింది.

Asian Games 2023: అదరగొట్టిన అథ్లెట్స్.. 33 పతకాలతో 4వ స్థానం చేరిన భారత్.. డబుల్ సెంచరీ కొట్టిన చైనా..
Asian Games 2023 Medal Standings

Updated on: Sep 30, 2023 | 6:35 AM

Asian Games 2023 Medal Standings: ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 8 స్వర్ణాలతో సహా మొత్తం 33 పతకాలు వచ్చి చేరాయి. 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్య పతకాలతో పట్టికలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఇక ఆతిథ్య చైనా 100 బంగారు పతకాల మార్కును దాటి, అగ్రస్థానంలో దూసుకపోతోంది. శుక్రవారం జరిగిన ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో భారత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల జట్టు (ఈషా సింగ్, పాలక్, దివ్య తాడిగోల్) రజతం సాధించింది. 1736 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకున్న చైనా తర్వాత భారత జట్టు 1731 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనీస్ తైపీ 1723 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.

కొద్దిసేపటికే, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3P టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ సునీల్ కుసాలే, అఖిల్ షెరాన్‌లతో కూడిన పురుషుల జట్టు స్వర్ణం దక్కించుకుంది.

ఐశ్వరీ ప్రతాప్ తర్వాత పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3P వ్యక్తిగత ఈవెంట్‌లో కూడా రజతం గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో పురుషుల ద్వయం సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్‌లు రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఫైనల్‌లో భారత షూటర్లు స్వర్ణం, రజత పతకాలను గెలుచుకున్నారు. 242.1 పాయింట్లు సాధించిన పాలక్ స్వర్ణం కైవసం చేసుకోగా, అలాగే మరో ప్లేయర్ ఈషా సింగ్ 239.7 పాయింట్లతో రజతం గెలుచుకుంది.

తర్వాత జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్‌లతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్‌తో 1-2తో ఓడి కాంస్యం సాధించింది.

మహిళల షాట్‌పుట్‌లో కిరణ్ బలియన్ తన మూడో ప్రయత్నంలో 17.36 మీటర్లతో కాంస్యం సాధించింది.

ఇదిలా ఉంటే, మొత్తం పతకాల సంఖ్య 200కు చేరుకోవడంతో 100 బంగారు పతకాల మార్కును దాటిన ఏకైక జట్టుగా చైనా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..