Watch Video: నీ సెల్ఫీ అభిమానం తగలెయ్యా.. మెస్సీ ప్రాణాలు పోయేవి కదరా అయ్యా..!
ఫుట్‌బాల్‌లో మ్యాచ్‌లో ఆగమాగం చేశాడు ఓ అభిమాని. ఫిఫా వరల్డ్‌కప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్ ముగిసిన వెంటనే, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అభిమాని ఆనందంలో మైదానంలో ముచ్చెమటలు పట్టించాడు.
ఫుట్‌బాల్(Football)లో మ్యాచ్‌లో ఆగమాగం చేశాడు ఓ అభిమాని. ఫిఫా వరల్డ్‌కప్ 2022(FIFA World Cup 2022) క్వాలిఫయింగ్ మ్యాచ్ ముగిసిన వెంటనే, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) అభిమాని ఆనందంలో తన అభిమాన ప్లేయర్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మెస్సీ.. మెస్సీ అంటూ గట్టిగా అరుస్తూ సెక్యూరిటీ దాటుకోని మరీ వచ్చి మరీ మెస్సీ వద్దకు చేరుకున్నాడు. అంతేకాదు.. మెస్సీ భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. దీంతో మెస్సీ కోపంతో.. బాస్ నేను మనిషినే అంటూ అతన్ని పక్కకు నెట్టేశాడు. ఆ తర్వాత గ్రౌండ్ సెక్యూరిటీ వచ్చి, ఆ అభిమానిని గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కాగా, అర్జెంటీనా జట్టు ఈక్వెడార్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. మెస్సీ టీంకు ఇది క్వాలిఫయింగ్‌లో చివరి మ్యాచ్. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అర్జెంటీనా జట్టు ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే 6 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. దీంతో అర్జెంటీనా జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అర్జెంటీనాతోపాటు ఉరుగ్వే, బ్రెజిల్, ఈక్వెడార్‌లు ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.
View this post on Instagram
Also Read: MI vs RR: ముంబై బౌలర్లను చితక్కొటిన బట్లర్.. ఈ సీజన్‌లో తొలి శతకం.. రోహిత్ సేన ముందు భారీ టార్గెట్..
KKR vs PBKS: బౌలర్‌కు సుస్సుపోయించిన రస్సెల్.. 225 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్..!