Anand Mahindra: వాగ్దానాన్ని నెరవేర్చిన ఆనంద్ మహీంద్రా.. వారికి బహుమతిగా ప్రత్యేక XUV వాహనం అందజేత..

|

Oct 31, 2021 | 7:34 AM

Anand Mahindra: టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో బంగారు పథకాలు సాధించిన విజేతలకు సర్‌ప్రైజ్ ఇస్తానంటూ ప్రకటించిన మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన వాగ్ధానాన్ని

Anand Mahindra: వాగ్దానాన్ని నెరవేర్చిన ఆనంద్ మహీంద్రా.. వారికి బహుమతిగా ప్రత్యేక XUV వాహనం అందజేత..
Neeraj
Follow us on

Anand Mahindra: టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో బంగారు పథకాలు సాధించిన విజేతలకు సర్‌ప్రైజ్ ఇస్తానంటూ ప్రకటించిన మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన వాగ్ధానాన్ని నెరవేర్చారు. ఇచ్చిన హామీ మేరకు గోల్డ్ మెడల్ విన్నర్స్‌కి ప్రత్యేక XUV700 ఎడిషన్ వాహనాన్ని అందజేశారు. శనివారం నాడు టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రా, సుమిత్‌ అంటిల్‌లకు ఈ వాహనాన్ని బహుమతిగా అందించారు. నీరజ్ చోప్రాకు ఇచ్చిన వాహనంపై 87.58 అని వ్రాసిన బంగారు జావెలిన్‌ను విసిరే ఒక క్రీడాకారుడి చిత్రాన్ని ముద్రించారు. టోక్యో ఒలింపిక్స్‌లో జాలెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

ఇక టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన పారాలింపియన్ సుమిత్ అంటిల్‌కు కూడా ఈ ప్రత్యేక వాహనాన్ని అందించారు. కుటుంబ సమేతంగా కారు షోరూమ్‌కి వెళ్లి తాళాలు తీసుకుని ఫొటోలు దిగారు. ఈ వాహనంపై అథ్లెట్ జావెలిన్ విసిరిన ఫోటోతో పాటు.. 68.55 అని రాశారు. సుమిత్ 68.55 మీటర్ల దూరం జావెలిన్ విసిరి బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

XUV700 జావెలిన్ ఎడిషన్ ఒలింపిక్ బంగారు విజేతల కోసం రూపొందించబడింది. ఎస్‌యూవీ కారుకు గోల్డెన్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందు నిలువు గ్రిల్, వెనుక డీకాల్స్, బ్రాండ్ లోగోపై గోల్డెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. SUV లోపలి వైపు కూడా గోల్డెన్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. జావెలిన్ ఎడిషన్ ఫీచర్లు మహీంద్రా SUV యొక్క స్టాండర్డ్ మోడల్‌ను పోలి ఉంటాయి.

Also read:

AP Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన..

Bigg Boss 5 Telugu: సన్నీపై రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నాగార్జున క్లాస్ మాములుగా లేదుగా..

PM Modi: వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ అందిస్తాం..జి 20 దేశాలకు ప్రధాని మోడీ హామీ!