Elon Musk – Manchester United: ఫుట్‌బాల్ క్లబ్‌పై కన్నేసిన టెస్లా సీఈవో.. గ్లేజర్ కుటుంబానికి షాక్ ఇస్తూ ట్వీట్..
Tesla CEO Elon Musk: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, షాక్ ఇచ్చాడు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ క్రీడా ప్రపంచం గురించి ఓ కీలక ప్రకటన చేశారు. అతను ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, షాక్ ఇచ్చారు. దీంతోపాటే ఎలోన్ మస్క్ సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ ట్వీట్లు కూడా చేయడం ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్‌లో ప్రకటించాడు. పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ క్లబ్ నుంచే ఆడుతున్న విషయం తెలిసిందే.
ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లు..
అయితే, ఎలోన్ మస్క్ క్లబ్ కొనుగోలుకు సంబంధించి ఎలాంటి వివరణాత్మక సమాచారాన్ని ఇవ్వలేదు. ఎలోన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు. ఇందులో ‘నేను రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి సమానంగా మద్దతిస్తానని స్పష్టం చేస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
దీని తర్వాత, ఈ ఎపిసోడ్‌లోని తదుపరి ట్వీట్‌లో మస్క్ ‘అలాగే నేను మాంచెస్టర్ యునైటెడ్‌ని కొనుగోలు చేయబోతున్నాను. మీకు స్వాగతం.’ అంటూ ప్రకటించాడు. మస్క్ చేసిన ఈ ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల రియాక్షన్స్ రావడం మొదలయ్యాయి.
To be clear, I support the left half of the Republican Party and the right half of the Democratic Party!
— Elon Musk (@elonmusk) August 16, 2022
ఫుట్‌బాల్ క్లబ్ ప్రస్తుత యజమాని మౌనంపై అనుమానాలు..
ఎలోన్ మస్క్ వివాదాస్పదంగా ట్వీట్ చేయడంలో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటి కొన్ని ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. మస్క్ తన ట్వీట్‌లో, అతను మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నాడా లేదా అనే వివరణ ఇవ్వలేదు.
No, this is a long-running joke on Twitter. I’m not buying any sports teams.
— Elon Musk (@elonmusk) August 17, 2022
వాస్తవానికి, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ప్రస్తుతం అమెరికన్ గ్లేజర్ కుటుంబం నియంత్రణలో ఉంది. మస్క్ చేసిన ఈ ట్వీట్ తర్వాత, గ్లేజర్ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన తెరపైకి రాలేదు. అదే సమయంలో ఈ ట్వీట్ తర్వాత, మస్క్ మరో ప్రకటన లేదా ట్వీట్ చేయకపోవడం గమనార్హం.