టీమిండియా నాలుగవ స్థానంపై మరోసారి లొల్లి..!

|

Jul 17, 2019 | 7:58 PM

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో.. టీమ్‌లోని డొల్లతనం బయటపడింది. ఇప్పటికే బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అటు జట్టుకు నాలుగవ స్థానం ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టే అంశం. యువరాజ్ సింగ్.. తర్వాత ఆ స్థాయి ఆటగాడు ఎవరూ కూడా టీమ్‌కు దొరకలేదు. వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ప్రయోగించినా.. అతడు కూడా విఫలమయ్యాడు. ఇక త్వరలో టీమిండియా విండీస్ పర్యటనకు సన్నద్ధమవుతుండగా.. పలు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లను టోర్నీకి […]

టీమిండియా నాలుగవ స్థానంపై మరోసారి లొల్లి..!
Follow us on

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో.. టీమ్‌లోని డొల్లతనం బయటపడింది. ఇప్పటికే బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అటు జట్టుకు నాలుగవ స్థానం ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టే అంశం. యువరాజ్ సింగ్.. తర్వాత ఆ స్థాయి ఆటగాడు ఎవరూ కూడా టీమ్‌కు దొరకలేదు. వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ప్రయోగించినా.. అతడు కూడా విఫలమయ్యాడు. ఇక త్వరలో టీమిండియా విండీస్ పర్యటనకు సన్నద్ధమవుతుండగా.. పలు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లను టోర్నీకి పంపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం భర్తీ చేయడానికి యువ క్రికెటర్లు.. శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మనీష్ పాండే పేర్లను సెలెక్టర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.