Nitish Kumar Reddy: నాన్నకు ప్రేమతో.. తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి

నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని, జీవితాన్ని సైతం వదులుకున్నాడు ఆయన తండ్రి ముత్యాల రెడ్డి. ఈ క్రమంలో తన తండ్రి త్యాగానికి గుర్తుగా ఆయనకు ఒక మరుపు రాని బహుమతి ఇచ్చాడు టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.

Nitish Kumar Reddy: నాన్నకు ప్రేమతో.. తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy

Updated on: Feb 10, 2025 | 7:12 PM

ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర ట్రోఫీలో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. బాక్సిండ్ టెస్టులో భాగంగా ప్రతిష్ఠాత్మక మెల్ బోర్న్ మైదానంలో పటిష్ఠమైన ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని మరీ మూడంకెల స్కోరు సాధించాడు. అంతేకాదు 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ట్రావిస్ హెడ్ , యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్ తర్వాత ఓవరాల్ గా 298 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. కాగా మెల్ బోర్న్ మైదానంలో సెంచరీ చేసినప్పుడు నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అక్కడే ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. తన త్యాగం, కష్టం ఊరికే పోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా కొడుకు కెరీర్ కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేశారు ముత్యాల రెడ్డి. బంధువులు, సన్నిహితులు సూటిపోటి మాటలు అంటున్నప్పటికీ కుమారుడి క్రికెట్ కెరీర్ కు అన్ని విధాలా అండగా నిలిచాడు. తండ్రి కష్టాన్ని దగ్గరుండి చూసిన నితీశ్ కూడా ఎంతో కష్టపడి టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు. నేడు అందరూ తనను చూసి గర్వపడే స్థాయికి చేరుకున్నాడు.

కాగా తన కోసం సర్వస్వం త్యాగం చేసిన తండ్రి ముత్యాల రెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు నితీశ్ కుమార్ రెడ్డి. ప్రత్యేకంగా బంగారు బ్రాస్ లైట్ తయారు చేయించి తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ తండ్రీ కొడుకుల అనుబంధంపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు నితీశ్ కుమార్ రెడ్డి. అలాగే టీ20 జట్టులోనూ స్థానం సంపాదించుకుంటున్నాడు. ఇక వన్డే జట్టులోనూ నితీశ్ ను చూడాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో నితీశ్ కుమార్ రెడ్డి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..