Neeraj Chopra: నవరాత్రి వేడుకల స్పెషల్‌.. గర్భా డ్యాన్స్‌తో అదరగొట్టిన బల్లెం వీరుడు

|

Sep 29, 2022 | 10:59 AM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అభిమానులతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న నీరజ్‌ సంప్రదాయ నృత్యమైన గర్భా డ్యాన్స్‌ వేశాడు.

Neeraj Chopra: నవరాత్రి వేడుకల స్పెషల్‌.. గర్భా డ్యాన్స్‌తో అదరగొట్టిన బల్లెం వీరుడు
Neeraj Chopra
Follow us on

జావెలిన్ త్రో గేమ్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తోన్న బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా చాలా రోజుల తర్వాత తన స్వస్థలమైన బరోడా చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతనికి అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అభిమానులతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న నీరజ్‌ సంప్రదాయ నృత్యమైన గర్భా డ్యాన్స్‌ వేశాడు. కాగా నీరజ్‌ను ఎక్కువగా క్రీడా దుస్తుల్లో చూసి ఉంటారు. కానీ, బరోడా చేరుకోగానే గర్బా డ్రెస్ వేసుకుని కనిపించాడీ యూత్‌ ఐకాన్‌. ఈ సందర్భంగా గరం గరం సిరో, నీరజ్ భాయ్ హీరో అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ప్రస్తుతం నీరజ్‌ బరోడా పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ గతనెలలో ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు గాయం కారణంగా చాలా రోజుల వరకు జావెలిన్‌ త్రోకు దూరంగా ఉన్న అతను డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ టోర్నీ తర్వాత వెకేషన్‌ కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన ఈ స్టార్‌ ప్లేయర్‌ స్కూబా డైవింగ్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఉత్సాహంగా గర్భా డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..