Siddartha Chowdary: ఉక్కు మనిషిని సైతం పిండి చేస్తున్న కరోనా.. తాజాగా మరో బాడీబిల్డర్ సిద్దార్ధ్ చౌదరి కోవిడ్‌తో మృతి

|

May 03, 2021 | 7:37 PM

కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి వారినైనా ఇట్టే తన వశం చేసుకుంటోంది. పేద, ధనిక.. చిన్న, పెద్దా.. సామాన్యుడు, సెలెబ్రిటీ.. అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది.

Siddartha Chowdary: ఉక్కు మనిషిని సైతం పిండి చేస్తున్న కరోనా.. తాజాగా మరో బాడీబిల్డర్ సిద్దార్ధ్ చౌదరి కోవిడ్‌తో మృతి
Body Builder Siddartha Chowdary
Follow us on

Body Builder Siddartha Chowdary: కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి వారినైనా ఇట్టే తన వశం చేసుకుంటోంది. పేద, ధనిక.. చిన్న, పెద్దా.. సామాన్యుడు, సెలెబ్రిటీ.. అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ఈ వైరస్ సోకిందంటే చాలు మనుషుల ప్రాణాలు హరిస్తోంది. తాజాగా.. ఉక్కులాంటి మనిషిని సైతం కరోనా పిండి చేసేసింది అనే వార్త సంచలనంగా మారింది. అందరిలోనూ భయాందోళనలు నింపింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ ఆదివారం అహ్మదాబాద్‌లో కరోనా కాటుకు బలయ్యారు.

జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్‌లో ఎన్నో అగ్రశ్రేణి టైటిళ్లు గెలుచుకున్న కండల వీరుడు సిద్ధార్ధ్ చౌదరి.. ఉక్కుమనిషిగా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కరోనాతో చౌదరి మరణించారనే వార్త బాడీబిల్డింగ్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

గత మూడు రోజుల్లో కోవిడ్‌తో మరణించిన రెండవ బాడీ బిల్డర్ చౌదరి కావడం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన చౌదరి మంచి బాడీ బిల్డర్‌గా పేరుగాంచాడు. కొన్ని నెలల క్రితం సూరత్‌లో జరిగిన మిస్టర్ గుజరాత్ పోటీలో అతను రన్నరప్‌గా నిలిచాడు అని రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పంచల్ అన్నారు. అహ్మదాబాద్ నివాసి అయిన చౌదరి.. చాలా సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ క్రీడలో ఉన్నాడని… అంతర్జాతీయ పోటీకి పంపాలని భావిస్తున్నామని పంచల్ చెప్పారు. గత రెండు వారాల క్రితం చౌదరి కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం తుది శ్వాస విడిచారు. చౌదరికి భార్య ఉంది. అతను వ్యక్తిగత శిక్షకుడిగా కూడా పనిచేశాడు. చౌదరి సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నాడు.

బాడీబిల్డింగ్ పోటీలో తనకంటూ సత్తా చాటుతున్న చౌదరి.. మంచి కండలు, బాడీ ఆకృతి ముందు మిగిలినవారు తేలిపోతారు. అలాంటి ఆకృతి కోసం చౌదరి చాలా కష్టపడ్డారు. ప్రతి ఉదయం రెండు గంటలు వ్యాయామం చేసేవారు. ప్రోటీన్, చికెన్, గుడ్లు, మాంసంతో పాటుగా మంచి పౌష్టికాహారం రోజూ తీసుకునేవారు. చిన్న వయస్సులోనే బాడీబిల్డింగ్ ప్రారంభించారు. ఆయన మరణానికి గుజరాత్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

కాగా, ఇటీవల ముంబైకు చెందిన అంతర్జాతీయ బాడీబిల్డింగ్ ఛాంపియన్ జగదీష్ లాడ్ కరోనా బారినపడి కన్నుమూశారు. జగదీష్ ”భారత్ శ్రీ” టైటిట్ సైతం గెల్చుకున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.నాలుగేళ్ల క్రితమే బాడీబిల్డింగ్ వదిలేశారు. లాక్ డౌన్ కారణంగా ఆయన జీవితం చిన్నాభిన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగదీష్ తో పాటు మరో బాడీబిల్డర్ లకన్.. సరైన ట్రీట్ మెంట్ అందలేదు. దీని కారణంగానే చనిపోయారు. జగదీష్ భార్య సైతం కరోనా బారిన పడ్డారు. ఇదిలావుంటే, కరోనా ఎవరికైనా రావొచ్చు. బాడీబిల్డర్లు అతీతం కాదు. బాడీబిల్డర్లు దేవుళ్లు కాదు. మేము కూడా కరోనా బారిన పడొచ్చు. తీవ్రంగా ఇబ్బంది పడొచ్చు” అని ఇంటర్నేషనల్ బాడీబిల్డర్ సమీర్ దబిల్ కర్ అన్నారు.

కాగా, గత వారం సెంట్రల్ రైల్వే బాడీబిల్డర్ మనోజ్ లకన్(30) సైతం కరోనాతో చనిపోయాడు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోనేలేదు. జగదీష్ లాడ్, మనోజ్ లకన్..ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారే. తాజాగా సిద్దార్ధ్ చౌదరి మరణం బాడీ బిల్డర్ అసోసియేషన్ జీర్ణించుకోలేకపోతోంది.

Read Also… ఒక సిటి స్కాన్ 300 ఛాతీ ఎక్స్‏రేలతో సమానం.. చాలా డేంజర్ అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్..