ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. ముంబై చేరుకున్న జట్టుకి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఓపెన్ టాప్ బస్సులో ఊరేగించింది. ముంబై ఆటగాళ్లందరూ.. బస్సు టాప్‌పై నిల్చొని అభిమానులకు అభివాదం చేశారు. ఈ ర్యాలీని తిలకించడానికి ముంబై అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారి పొడవున అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ముంబై ఇండియన్స్ జట్టు షేర్ చేసింది.
?: ? CH4MPIONS ARE ? ?#OneFamily #CricketMeriJaan #MumbaiIndians pic.twitter.com/CrtcXS4M1P
— Mumbai Indians (@mipaltan) May 13, 2019