AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి మద్రాస్ హైకోర్టులో ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. తనపై వచ్చిన నిందలకు వ్యతిరేకంగా ధోనీ వేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా, ఇప్పుడు ఆయన ఏకంగా రూ.10 లక్షలు కోర్టులో జమ చేయాల్సి వచ్చింది. అయితే ఇది జరిమానా కాదు, ఒక ప్రత్యేకమైన పని కోసం కోర్టు చేసిన ఆదేశం.

MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్
Ms Dhoni
Rakesh
|

Updated on: Feb 13, 2026 | 9:33 AM

Share

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి మద్రాస్ హైకోర్టులో ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. తనపై వచ్చిన నిందలకు వ్యతిరేకంగా ధోనీ వేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా, ఇప్పుడు ఆయన ఏకంగా రూ.10 లక్షలు కోర్టులో జమ చేయాల్సి వచ్చింది. అయితే ఇది జరిమానా కాదు, ఒక ప్రత్యేకమైన పని కోసం కోర్టు చేసిన ఆదేశం. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఆ సమయంలో కొన్ని మీడియా సంస్థలు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ధోనీకి ఈ స్కామ్‌తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ, 2014లో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు గత 12 ఏళ్లుగా సాగుతోంది. అయితే, ఈ కేసులో ధోనీ తరపున సమర్పించిన సాక్ష్యాలలో ఎక్కువగా హిందీ భాషలో ఉన్న న్యూస్ క్లిప్పులు, టీవీ చర్చల రికార్డింగ్‌లు ఉన్నాయి. వీటిని లిఖిత రూపంలోకి మార్చడం, అనువదించడం ఇప్పుడు కోర్టుకు పెద్ద సవాల్‌గా మారింది.

జస్టిస్ ఆర్.ఎన్. మంజుల ఈ కేసును విచారిస్తూ.. హిందీలో ఉన్న భారీ రికార్డింగ్‌లను అనువదించడం అనేది చాలా పెద్ద పని అని పేర్కొన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అనువాదకుడిని, ఒక టైపిస్టును మూడు నుంచి నాలుగు నెలల పాటు నియమించాల్సి ఉంటుంది. ఈ పనికి అయ్యే ఖర్చును వాదించే పక్షం అయిన ధోనీయే భరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.10 లక్షలను మార్చి 12, 2026 లోపు చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‎లో జమ చేయాలని ఆదేశించింది.

ఈ 12 ఏళ్ల ప్రయాణంలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ధోనీపై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి జీ.సంపత్ కుమార్‌పై కోర్టు ధిక్కార కేసు కూడా నడిచింది. గతంలో కోర్టుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు 15 రోజుల జైలు శిక్ష కూడా పడింది. కానీ సుప్రీంకోర్టు దానిపై స్టే ఇచ్చింది. గత ఏడాది ధోనీ సెలబ్రిటీ హోదాను దృష్టిలో ఉంచుకుని, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన సాక్ష్యాన్ని కోర్టు వెలుపలే రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ రూ.10 లక్షల డిపాజిట్ తర్వాత కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.

ధోనీ రూ. 10 లక్షలు చెల్లించిన తర్వాతే అనువాద ప్రక్రియ మొదలవుతుంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 12న జరగనుంది. పదేళ్లకు పైగా సాగుతున్న ఈ పోరాటంలో ధోనీ తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవడానికి ఎంతకైనా సిద్ధపడ్డారు. సాక్ష్యాల అనువాదం పూర్తయితే, ఈ పరువు నష్టం దావాలో ఒక కీలకమైన దశ ముగిసినట్టే. మరి 100 కోట్ల దావాలో ధోనీ విజయం సాధిస్తారో లేదో చూడాలి.