టీమిండియా క్రికెటర్‌ షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్.. తండ్రి కూతుళ్లను వేరు చేసేందుకు ప్లాన్..?

Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కెరీర్‌కు.. అతడి వైవాహిక జీవితం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సాఫీగా లేదన్న..

టీమిండియా క్రికెటర్‌ షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్.. తండ్రి కూతుళ్లను వేరు చేసేందుకు ప్లాన్..?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 02, 2021 | 10:07 PM

Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కెరీర్‌కు.. అతడి వైవాహిక జీవితం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సాఫీగా లేదన్న సంగతి తెలిసిందే. భార్య హసీన్ జహాన్‌తో తరచూ గొడవలు జరుగుతుండేవి. 2018లో విబేధాలు తలెత్తడంతో భార్య హసీన్ జహాన్ వేరుగా ఉంటోంది. అయితే పాప ఐరా కోసం షమీ అప్పుడప్పుడూ ఆమె దగ్గరకు వెళ్తుండేవాడు. ఇక ఇప్పుడు షమీ గారాల పట్టి ఐరాను కూడా అతడి నుంచి దూరం చేసే పనిలో హసీన్ జహాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు పలు సందేహాలకు తావిస్తోంది.

ఇటీవల తన కూతురు ఐరా ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో షమీ సర్‌నేమ్‌ను తొలగించి ‘ఐరా జహాన్’ అని క్యాప్షన్ ఇచ్చింది. కూతురును తండ్రి నుంచి దూరం చేయాలనే ఆలోచనతోనే హసీన్ జహాన్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో షమీపై గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలతో హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..