Virat Kohli: విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ.. వామిక.. నెంబర్ 11.. అసలు సీక్రెట్ ఏంటో.?

Virat Kohli And Anushka Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క జంటకు '11' నెంబర్‌తో విడదీయరాని బంధం ఉందని అభిమానులు...

Virat Kohli: విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ.. వామిక.. నెంబర్ 11.. అసలు సీక్రెట్ ఏంటో.?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 02, 2021 | 9:39 PM

Virat Kohli And Anushka Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క జంటకు ’11’ నెంబర్‌తో విడదీయరాని బంధం ఉందని అభిమానులు అంటున్నారు. కోహ్లీ పుట్టిన నెల, పెళ్లి రోజు, కూతురు పుట్టిన రోజు.. ఇలా అన్నింటితో ’11’కు సంబంధం ఉందని చెబుతున్నారు. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లీ పుట్టింది 11వ నెలలో.. అలాగే అనుష్కతో పెళ్లి జరిగిన రోజు డిసెంబర్ 11.. ఇక వీరికి కూతురు వామిక పుట్టింది జనవరి 11న.. ఇలా విరాట్ కోహ్లీకి 11తో అనుబంధం ఉందని అతడి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సంఖ్య వెనుక సీక్రెట్ ఏంటో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు.!

ఇక న్యూమరాలజీ ప్రకారం అనుష్కకు లక్కీ నెంబర్ 3 కాగా.. విరాట్‌కు 7, అలాగే వామికకు నెంబర్ 3 అని తెలుస్తోంది. అయితే ‘విరుష్కా’ జంటకు నెంబర్ 11 బాగా కలిసొస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. కాగా, విరాట్, అనుష్క తమ కూతురును ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ కూతురుకి ‘వామిక’ అనే నామకరణం చేశామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..