ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ నాణ్యమైన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తుంది. ఆసీస్, న్యూజిలాండ్‌లో వీటినే ఉపయోగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు సాయపడాలని కూకాబుర్ర నడుం బిగించింది. మైక్రోచిప్‌లను అమర్చిన స్మార్ట్ బంతుల్ని తయారు చేస్తోంది. వచ్చే బిగ్‌బాష్ సీజన్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే స్మార్ట్ బంతిని రకరకాలుగా పరీక్షించింది. చివరిగా బిగ్‌బాష్‌లో ప్రయోగిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోనుంది. బంతి వేగం, నియంత్రణ, కోణం, ఏ పాయింట్‌లో రిలీజ్ చేశారు, బంతి పిచ్ అయ్యే ముందు బౌన్స్ ఎంత, పిచ్ అయిన తర్వాత బౌన్స్ ఎంత వంటి గణాంకాలను సరికొత్త స్మార్ట్ బంతి సమగ్రంగా, అత్యంత కచ్చితత్వంతో అందించనుంది! ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్ అవుతోంది?గాలిని బట్టి ఎంత వేగంతో బంతిని విసరాలి? ఎక్కడ విసిరితే ఎలా టర్న్ అవుతుంది?వంటి వివరాల్ని ఇవ్వనుంది. ఐసీసీ నిర్వహించే బహుళ దేశాల టోర్నీల్లో కీలక సమయాల్లో స్మార్ట్ బంతి సమగ్రమైన వివరాలు అందిచగలదని అంచనా వేస్తున్నారు. దీంతో అంపైర్లు, ఆటగాళ్ల మధ్య అభిప్రాయబేధాలు రాకుండా ఉంటాయి.
ఈ స్మార్ట్ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్ అనే సంస్థ చేతులు కలిపింది. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైకేల్ కస్ప్రోవిచ్ దానికి ఛైర్మన్. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ లీగుల్లో ఈ బంతిని పరీక్షించాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన టీ20 లీగ్ ‘బిగ్‌బాష్’ అన్న సంగతివిదితమే.
New Kookaburra SmartBall: making the ball talk.
Interested? Register your interest today: https://t.co/DocCJujcjW pic.twitter.com/8yP9vnkjc5
— Kookaburra Cricket (@KookaburraCkt) August 10, 2019