పీవీ సింధుకు పద్మభూషణ్‌.. మేరీకోమ్‌కు పద్మవిభూషణ్‌?

పీవీ సింధుకు పద్మభూషణ్‌.. మేరీకోమ్‌కు పద్మవిభూషణ్‌?
This is the first time that all the names recommended by the sports ministry for the Padma awards are of women.

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కనుంది. దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌కు ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ పేరును అవార్డుల కమిటీకి సిఫారసు చేసింది. పద్మశ్రీ అవార్డుకు అర్హులుగా మరో తొమ్మిది మంది క్రీడాకారుల పేర్లను పంపింది. అవార్డు విజేతలను గణతంత్ర దినోత్సవ […]

Ram Naramaneni

|

Sep 13, 2019 | 3:52 AM

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కనుంది. దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌కు ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ పేరును అవార్డుల కమిటీకి సిఫారసు చేసింది. పద్మశ్రీ అవార్డుకు అర్హులుగా మరో తొమ్మిది మంది క్రీడాకారుల పేర్లను పంపింది. అవార్డు విజేతలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు.

2015లో పద్మ శ్రీ పొందిన సింధుకు 2017 అవార్డుల కమిటీ పద్మ భూషణ్‌ నిరాకరించింది. అయితే ఇటీవల సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలవడంతో ఈసారి పద్మభూషణ్‌ పురస్కారం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. మేరీకోమ్‌ 2006లో పద్మ శ్రీ, 2013లో పద్మ భూషణ్‌ పురస్కారాలను అందుకుంది. పద్మ విభూషణ్‌ పురస్కారం వరిస్తే, చెస్‌ మాంత్రికుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ (2007), దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (2008), పర్వతారోహణకులు సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న అథ్లెట్‌గా మేరీకోమ్‌ నిలువనుంది. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ మెరుపు తార మానిక బత్ర, మహిళల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, మాజీ షూటర్‌ సుమా షిమ్రోర్‌, పర్వాతారోహణ కవల సోదరీమణులు తషీ, మాలిక్‌ల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందని సంబంధిత వర్గాల వెల్లడించాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu